newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

చంద్రబాబు, పవన్‌పై ఎమ్మెల్యే ఆర్కె సంచలన ఆరోపణలు

03-01-202003-01-2020 13:39:59 IST
Updated On 03-01-2020 13:47:08 ISTUpdated On 03-01-20202020-01-03T08:09:59.217Z03-01-2020 2020-01-03T08:09:56.940Z - 2020-01-03T08:17:08.688Z - 03-01-2020

చంద్రబాబు, పవన్‌పై ఎమ్మెల్యే ఆర్కె సంచలన ఆరోపణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు రాజధాని పేరుతో లక్షల కోట్లల్లో అవినీతి చేశారన్నారు. తనపై టీడీపీ నేత బోండా ఉమా చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచి ఉన్నాయని ఎవరైనా చెక్ చేసుకోవచ్చన్నారు. తన భార్యకు నీరుకొండ గ్రామంలో ఐదు ఎకరాలు భూమి ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, భూమి ఉందని కనిపెట్టిన వారికి ఆ ఐదు ఎకరాలు రాసి ఇచ్చేస్తానన్నారు ఆర్కె.

రెండు పత్రికలు తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తన వివరణ అడగకుండా భూములు వున్నాయని ఎలా రాస్తారన్నారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయం పడుతున్నారన్నారు. లక్షల కోట్ల అవినీతి బయట పడుతుందని బేంబేలెత్తిపోతూ కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజధానికి చంద్రబాబు పెద్ద శాపం.. రాజధానికి సీఎం వైయస్ జగన్ వరం అన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో భయపెట్టి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కోలేదా..?ఐదేళ్లుగా రాజధాని రైతుల్ని దోచుకోవడం తప్ప.. రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొన్న భూముల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని, బినామీ భూముల విలువ పడిపోతుందని చంద్రబాబు బాధపడిపోతున్నాడన్నారు ఆర్కె. 

ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే జగన్ రాజధానుల ఆలోచన చేస్తున్నారన్నారు. ఐదేళ్లు రాజధాని అమరావతిలో అవినీతి జరిగితే పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని.. ఇప్పుడు వచ్చి ఆందోళన చేయడం ఏంటన్నారు.

రాజధాని విషయంలో ప్యాకేజి తీసుకుని పవన్ కల్యాణ్ సైలెంట్ అయిపోయాడన్నారు. ప్యాకేజీ కోసమే పవన్ మంగళగిరిలో జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టలేదని. అయినా లోకేష్ ఓడిపోయాడన్నారు. రాజధాని రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు మోసం చేస్తే.. ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ పరోక్షంగా మోసం చేశాడని మండిపడ్డారు.

చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి పర్యటనకు ఎందుకు వచ్చారని, భూములు ఇవ్వని రైతుల్ని చంద్రబాబు కొట్టించినప్పుడు భువనేశ్వరి ఏమయ్యారని ఆర్కె ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు అమరావతిలో వున్న బాబు రాష్ట్రంలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదో చెప్పాలన్నారు.

తన తండ్రి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. రాజధానిలో మన ఇల్లు ఎక్కడ అని లోకేష్ చంద్రబాబు ను అడగాలన్నారు. మంగళగిరి హద్దులు కూడా లోకేష్ కు తెలియవన్నారు. అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే తప్పేముందన్నారు ఆర్కె. అలా చేస్తే తాను స్వాగతిస్తానన్నారు ఆర్కె. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle