newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

చంద్రబాబు నివాసం కూల్చివేతకు తుది హెచ్చరికే..!

22-09-201922-09-2019 14:23:41 IST
2019-09-22T08:53:41.931Z22-09-2019 2019-09-22T08:53:34.278Z - - 09-12-2019

చంద్రబాబు నివాసం కూల్చివేతకు తుది హెచ్చరికే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్‌ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు శనివారం తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్‌ ప్లాన్‌ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది కరకట్ట ప్రాంతంలో నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే ప్రభుత్వ సంస్థ నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. 

కానీ దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో తాజాగా లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్‌ అసోసియేషన్‌ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్‌డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు. తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. 

చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్‌ కూడా సీఆర్‌డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్‌డీఏ లేదని, కాబట్టి సీఆర్‌డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్‌డీఏకు పలు సూచనలు చేసింది.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్‌డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు.

లింగమనేని భవనంలో కాంక్రీట్ నిర్మాణానికి తోడుగా స్విమ్మింగ్ పూల్, హెలిపాడ్ కూడా కరకట్టకు వంద మీటర్ల దూరంలోనే నిర్మించడం, ఎలాంటి అనుమతీ లేకుండానే అక్కడ పది తాత్కాలిక షెడ్లు లేపడంపై సీఆర్‌డీఏ ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలికాలంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో సీఆర్‌డీఏ అధికారులు కరకట్టపై అక్రమ నివాసంలో ఉంటున్న ఆరోపణతో మాజీ సీఎంకి తుది నోటీసు ఇవ్వడం గమనార్హం. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో ఉడుకుతున్న ఏపీ రాజకీయ వాతావరణం చంద్రబాబుకు నోటీసు నేపథ్యంలో మరింత వేడెక్కనుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle