newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

చంద్రబాబు నివాసంపై డ్రోన్ వీడియో కలకలం.. తెలుగు తమ్ముళ్ళ నిరసన

16-08-201916-08-2019 16:28:02 IST
Updated On 16-08-2019 16:29:53 ISTUpdated On 16-08-20192019-08-16T10:58:02.970Z16-08-2019 2019-08-16T10:58:01.040Z - 2019-08-16T10:59:53.195Z - 16-08-2019

 చంద్రబాబు నివాసంపై డ్రోన్ వీడియో కలకలం.. తెలుగు తమ్ముళ్ళ నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ ఇంటిని, పరిసర ప్రాంతాలపై ఇవాళ డ్రోన్ కెమేరాలతో చిత్రీకరణ జరపడం వివాదంగా మారింది. ఈ ఘటనపై చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  ‘ నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు? చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? డ్రోన్లు ఎగరేస్తూ పట్టుబడిన వ్యక్తులెవరు?

ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలి. నిఘా వేసిందెవరో, దాని వెనక కుట్ర ఏముందో తెలియజేయాలి’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రీకరించిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీంతో కరకట్ట పై తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కరకట్టపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇదిలా ఉంటే డ్రోన్లతో చిక్రీకరించమని మేమే చెప్పామని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది.

వరద పరిస్థితిని అంచనా వేయడానికి, ముంపు ప్రాంతాల అవగాహన కోసం డ్రోన్లతో చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. డ్రోన్‌ ప్రయోగించి పట్టుబడినవారు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. నిన్న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా తామే చిత్రీకరించామని తెలిపారు. అధికారుల ఆదేశాలమేరకే డ్రోన్‌లతో చిత్రీకరించినట్టు వారు చెబుతున్నారు.

హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న తన నివాసంపై డ్రోన్లు వినియోగంపై జిల్లా ఎస్పీ, డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. డ్రోన్లు వాడాలంటే డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని.. మరి ఈ డ్రోన్లకు ఎవరు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జెడ్ సెక్యూరిటీలో ఉన్న తన నివాస భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.

కొన్ని డ్రోన్లు చంద్రబాబు ఇంటిపై ఎగరడాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది డ్రోన్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసి ఉన్నతాధికారుల దృ‌ష్టికి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, దేవినేని అవినాష్ తదితరులు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. డ్రోన్లు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనను తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా పోటీగా పోటీగా అక్కడకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఇరువర్గాల వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో రంగంలోకి పోలీసులు పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు.

ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, మద్దాల గిరి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ పరిస్థితి ఏర్పడింది. 

ఈ ఘటనపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. NSG భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర?  అంటూ నిప్పులు చెరిగారు లోకేష్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle