newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-2

22-04-201922-04-2019 12:58:07 IST
Updated On 22-04-2019 17:53:01 ISTUpdated On 22-04-20192019-04-22T07:28:07.105Z22-04-2019 2019-04-22T07:28:05.155Z - 2019-04-22T12:23:01.370Z - 22-04-2019

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లో ఉప‌ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకు మొద‌టిసారి టిక్కెట్ ద‌క్కింది. ఆయ‌న‌పై వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి పోటీ చేశారు. ఆమె భ‌ర్తను ప్రత్యర్థులు హ‌త్య చేశారు. దీంతో ఆమె ప‌ట్ల ప్రజ‌ల్లో సానుభూతి ఉంది. దీంతో ఇక్కడ కేఈ వార‌సుడి విజ‌యం క‌ష్టమే అంటున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున‌కు టిక్కెట్ ఇచ్చారు. ఆయ‌న వైసీపీ అభ్యర్థి బొత్స స‌త్యనారాయ‌ణ‌ను ఎదుర్కోలేక‌పోయారు. ఇక్కడ బొత్స గెలుపు క‌ష్టమేమీ కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళ‌హ‌స్తి, గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు కుమారుడు గాలి భానుకు న‌గ‌రి టిక్కెట్లు ఇచ్చారు. వీరిద్దరికీ వైసీపీ అభ్యర్థులు బియ్యపు మధుసూద‌న్ రెడ్డి, ఆర్కే రోజా తీవ్ర పోటీ ఇచ్చారు. ఈ రెండు స్థానాల్లోనూ టీడీపీ వార‌సుల గెలుపు క‌ష్టమే అన్నట్లుగా ప‌రిస్థితి ఉంది. అనంత‌పురం ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్‌కు టిక్కెట్ ద‌క్కింది. ఆయ‌న‌కు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చారు. 

ప్రకాష్ రెడ్డిపై రెండుసార్లు ఓడిన సానుభూతి ఉంది. ఒక‌వేళ సునీత‌నే మ‌ళ్లీ పోటీ చేసి ఉంటే త‌ప్పకుండా గెలిచే వార‌ని, శ్రీరామ్ గెలుపు క‌ష్టంగా మారింద‌ని అంటున్నారు. తాడిప‌త్రిలో జేసీ ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. అనంత‌పురం ఎంపీ టిక్కెట్ ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్‌కు ఇచ్చారు. వీరికి గెలుపు అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. అయితే, మిగ‌తా జిల్లాల కంటే అనంత‌పురంలోనే వార‌సుల‌కు గెలుపు అవ‌కాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి.

విజ‌య‌వాడ వెస్ట్‌లో ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూతురు ష‌బానా ఖాతూన్, శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో గౌతు శ్యాంసుంద‌ర్ శివాజి కూతురు గౌతు శిరీష పోటీలో ఉన్నారు. వీరికి కూడా గెలుపు అవ‌కాశాలు మెరుగ్గా ఏమీ లేవు. రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసిన ముర‌ళీమోహ‌న్ కోడ‌లు మాగంటి రూప కంటే వైసీపీ అభ్యర్థి మార్గాని భ‌ర‌త్ గెలుపు రేసులో ముందున్నారు. ఇలా వారసుల‌కు టిక్కెట్ల కేటాయింపులో పెద్దపీట వేసిన చంద్రబాబు పెద్ద రిస్క్ తీసుకున్నట్లు క‌నిపిస్తోంది. ఒక‌వేళ మ్యాజిక్ ఫిగ‌ర్‌కు స‌మీపానికి వ‌చ్చి టీడీపీ ఆగిపోతే బాబు చేసిన రిస్క్ దెబ్బకొట్టిన‌ట్లే అనుకోవాలి. 

 

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-1  https://www.newssting.in/p/5cbd6c71ed50b81d17dcddce


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle