newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-1

22-04-201922-04-2019 12:55:44 IST
Updated On 22-04-2019 17:51:47 ISTUpdated On 22-04-20192019-04-22T07:25:44.564Z22-04-2019 2019-04-22T07:25:37.762Z - 2019-04-22T12:21:47.415Z - 22-04-2019

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నిక‌ల్లో వార‌సుల‌కు పెద్దపీట వేసింది. సుమారు 10 మంది సీనియ‌ర్ నేత‌ల‌కు వార‌సుల‌కు ఈసారి ఆ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. మంత్రులుగా ఉన్న వారు సైతం ఇక ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతూ వార‌సుల‌కు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అడిగిందే త‌డ‌వుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేత‌ల వార‌సుల‌కు టిక్కెట్లు కేటాయించారు. అయితే, వార‌సుల‌కు టిక్కెట్లు కేటాయించి చంద్రబాబు రిస్క్ తీసుకున్నట్లే క‌నిపిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగాయి. రెండు పార్టీల‌కూ గెలుపుపై పూర్తి ధీమా లేదు. ఇక‌, హంగ్ వ‌స్తే చ‌క్రం తిప్పాల‌ని ప‌వ‌న్ కళ్యాణ్ కాచుకొని కూర్చున్నారు. ఈ స‌మ‌యంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా చాలా కీల‌కం.

అయినా, సీనియ‌ర్ నేత‌ల‌ను హ‌ర్ట్ చేయ‌డం ఇష్టం లేక వారి వార‌సుల‌కు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇదే పార్టీకి కొంత ఇబ్బందిగా మారింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. పోటీలో ఉన్న వార‌సుల్లో కనీసం స‌గం మందికి ఎదురుగాలి వీచింద‌ని, వారి గెలుపు క‌ష్టమేన‌నే అంచ‌నాలు ఉన్నాయి. వార‌సుల‌కు కాకుండా సీనియ‌ర్ నేత‌ల‌కే టిక్కెట్లు ఇచ్చి ఉంటే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేవని అంటున్నారు.

వార‌సుల ప‌ట్ల ప్రజ‌ల‌తో పాటు పార్టీ క్యాడ‌ర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కొంద‌రు బ‌య‌ట‌కు ప్రచారం చేసినా లోప‌ల మాత్రం ఇన్నేళ్లు వారి తండ్రుల‌ను మోసుకొని తిరిగాం.. ఇప్పుడు వార‌సుల‌ను మోయాలా అనే అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే స్థాయికి ఎద‌గాల‌నుకునే కొంత బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఇదే అసంతృప్తితో ఉన్నారు. ఇది వార‌సుల‌కు బాగా మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉన్నట్లు క‌నిపిస్తోంది.

(ఇంకా ఉంది)

చంద్రబాబు దిద్దుకోలేని పొరపాటు చేశారా-2 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి  https://www.newssting.in/p/5cbd6d05ed50b81d17dcddd1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle