newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

‘‘చంద్రబాబు తప్పులే జగన్ కు ప్లస్ అయ్యాయి’’

06-11-201906-11-2019 08:18:42 IST
Updated On 06-11-2019 17:04:08 ISTUpdated On 06-11-20192019-11-06T02:48:42.073Z06-11-2019 2019-11-06T02:45:41.168Z - 2019-11-06T11:34:08.171Z - 06-11-2019

‘‘చంద్రబాబు తప్పులే జగన్ కు ప్లస్ అయ్యాయి’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనా కాలంలో అనేక తప్పులు చేశారన్నారు. అమరావతి రాజధాని అంటూ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్ అన్నారు. అందువల్లే జనం చంద్రబాబుని దూరం పెట్టారని విమర్శించారు.

ఏపీలో నాలుగైదు నెలల్లో సిమెంట్ బస్తా ధర 20 రూపాయలు పెరగనుందని.. అది ఎందుకు పెరుగుతుందో తర్వాత చెప్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అవమానకరంగా బదిలీ చేశారు. ఇలాంటి చర్యలు అధికారుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తెస్తాయన్నారు.

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ని గుంటూరు హెచ్ ఆర్డీకి బదిలీ చేయడం ఘోరంగా ఉందని, సీనియర్ ఐఏఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే సాధారణ అధికారుల సంగతేంటన్నారు. కారణాలు ఎలాంటివైనా బదిలీ చేసిన సబబుగా లేదన్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రభుత్వం నడుస్తుందన్నారు.

జగన్ సీఎం అయినప్సటినుంచీ ఐదు నెలలుగా అనేకమంది అధికారులకు పోస్టింగ్ లు లేకుండా హోల్డ్ లో ఉంచారని, ఇది సరైన విధానం కాదన్నారు సుజనా చౌదరి. 

సామాజిక వర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఇది సమతుల్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇసుక కొరత పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని.. అందుకే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఏపీలో రూ.300 కోట్ల కు మించి ఇసుక ద్వారా ఆదాయం రాదన్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 

వైసీపీ నేతలు ఎన్నికలు అయిపోయాయనే అంశాన్ని గుర్తిస్తే మంచిదని, మీడియా మీద ఆంక్షలు సమంజసం కాదన్నారు. లిక్కర్ పాలసీ ని మార్చడం మూలంగా ఆదాయం పెరగలేదని, ధరలు పెరిగి సామాన్యులపై భారం పెరిగిందన్నారు. రివర్స్ టెండరింగ్ చేశారు కానీ పోలవరం అథారిటీ నుంచి అనుమతి లభించలేదన్నారు.

ఏపీలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ రిజర్వేషన్లు తీసుకొచ్చారని, రాజ్యాంగపరంగా ఇది చెల్లదన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కారణంగా పరిశ్రమలు రావడం లేదన్నారు. 

తమకు వైసీపీ,టీడీపీ రెండు ప్రత్యర్ధులే అన్నారు. కేంద్రప్రభుత్వం విడుదలచేసిన మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడంపై సుజనాచౌదరి స్పందించారు.

ఏపీ ప్రభుత్వం నుంచి గతంలో నోటిఫికేషన్ ఇవ్వనందు వల్లే మ్యాప్ లో అమరావతి లేదన్నారు. చంద్రబాబు తప్పులే జగన్ కు ప్లస్ అయ్యాయని తాను భావిస్తున్నానన్నారు. వైసీపీ పాలన వల్ల జనం ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle