newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

చంద్రబాబు జోరు.. టీడీపీ శ్రేణుల బేజారు..!

12-11-201912-11-2019 08:23:13 IST
2019-11-12T02:53:13.125Z12-11-2019 2019-11-12T02:46:41.896Z - - 14-08-2020

చంద్రబాబు జోరు.. టీడీపీ శ్రేణుల బేజారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌రువాత కొంత‌కాలంపాటు సైలెంట్‌గా ఉండాల‌ని, కొత్త ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇద్దామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ వ‌ర్గాల‌కు సూచించినా కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన కొన్ని రోజుల‌కే ఆ పార్టీ శ్రేణులు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షం ఎక్క‌డ ఉందా..? అని ఎదురుచూసే వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని విమర్శించ‌కూడ‌దు. కార్య‌క్ర‌మాలు చేయ‌కూడ‌ద‌ని కూడా చంద్ర‌బాబు అనుకున్నా.. మొద‌ట‌గా ప్ర‌జావేదిక కూల‌గొట్ట‌డం ద‌గ్గ‌ర్నుంచి టీడీపీ నాయ‌కుల‌పై దాడులు, ఛ‌లో ఆత్మ‌కూరు ఘ‌ట‌న‌, కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు ఆత్మహ‌త్య‌, ఇసుక ఉద్య‌మాలు త‌దిత‌ర అంశాల‌పై ఈ ఆరునెల‌ల్లోనే ఐదు సంవ‌త్స‌రాలు చేయాల్సిన పోరాటాలు చేసేసింది.

అంతేగాక ఈ నెల 14న చంద్ర‌బాబు ఇసుక దీక్ష కూడా చేయ‌బోతున్నారు. ఇవేకాకుండా జిల్లాల పర్య‌ట‌నలు కూడా చంద్ర‌బాబు చేస్తున్న విష‌యం విధిత‌మే. ఇదే విష‌య‌మై త‌మ అధినేత స్పీడుకు త‌ట్టుకోలేక టీడీపీ నాయ‌కుల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు బెంబేలెత్తిపోతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల్లో చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఎన్నిక‌లైన కొత్త‌లో రాజ‌కీయాలు చాలా వేడిగా ఉంటాయ‌ని, అధికార పార్టీ కొంత స్పీడ్‌గా వ్య‌వ‌హారాలు చేస్తుంద‌ని, ప్ర‌తిప‌క్షంగా మ‌నం కొంత త‌గ్గి ఉండాల‌న్నది టీడీపీ సీనియ‌ర్ నేత‌ల వాద‌న‌.

అందుకు విరుద్దంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న కార్య‌క్ర‌మాల వ‌ల్ల గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులు కాస్తా అధికార పార్టీకి టార్గెట్‌గా మారుతున్నట్టు స‌మాచారం.

ముఖ్యంగా టీడీపీ చేసిన ఇసుక పోరాటాల‌వ‌ల్ల గ్రామ స్థాయిలోని కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు అధికార పార్టీకి ల‌క్ష్యంగా టార్గెట్ అయ్యార‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని అధినేత ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లినా త‌ప్పించుకునేందుకే సాకులు చెబుతున్నారంటూ త‌మ‌నే త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితుల్లో ఉంద‌ని ఫీల‌వుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో ఓడిపోయి అనేక ఇబ్బందులు ప‌డుతున్నామని, ఆర్థికంగా చితికిపోయామ‌ని, అధినేత స్పీడువ‌ల్ల మ‌రిన్ని ఇబ్బందులుప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని వారు అంటున్నారు.

ఈ మ‌ధ్య జ‌రిగిన రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నేత‌లు ఒక‌రికొక‌రు చెప్పుకుని బోరుమ‌న్న‌ట్టు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారు. ఇప్పుడ‌ప్పుడే ఏమైనా ఎన్నిక‌లు ఉన్నాయా..? అధినేత ఎందుకు మమ్మ‌ల‌ని ఊపిరాడ‌నివ్వ‌కుండా ప‌రుగులుపెట్టిస్తున్నారో అర్ధం కావ‌డం లేదంటూ పార్టీ త‌మ్ముళ్లంతా డిస్క‌ర్ష‌న్‌ చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఉపాధిహామీ ప‌నుల ద్వారా రావాల్సిన బిల్లుల‌ను ప్ర‌భుత్వం తొక్కిపెట్టింద‌ని, పార్టీ ఇచ్చే కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి కూడా ఆర్థికంగా ఇబ్బందిప‌డిపోతున్నామ‌ని టీడీపీ శ్రేణులు తెగ బాధ‌ప‌డిపోతున్నారని, అందుకే చాలా మంది పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నార‌ని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా పార్టీ శ్రేణుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకునైనా అధినేత చంద్ర‌బాబు కొద్దిగా గ్యాప్ ఇస్తారేమో చూడాలి మరీ..!

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   an hour ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   an hour ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   3 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   17 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle