newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

‘‘చంద్రబాబు-జగన్‌లకు పెద్ద తేడా లేదు’’

21-11-201921-11-2019 16:21:31 IST
Updated On 21-11-2019 16:54:59 ISTUpdated On 21-11-20192019-11-21T10:51:31.890Z21-11-2019 2019-11-21T10:51:29.569Z - 2019-11-21T11:24:59.573Z - 21-11-2019

‘‘చంద్రబాబు-జగన్‌లకు పెద్ద తేడా లేదు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో ఒకవైపు టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల విషయంలో కామెంట్లకు వైసీపీని టార్గెట్ చేసింది టీడీపీ. తిరుమల జోలికి వచ్చినవారు మాడి మసైపోయారన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు తాజా రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు. చంద్రబాబు, జగన్ కు మతపరమైన విధానంలో పెద్ద తేడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.

క్రిష్టియన్, ముస్లింల ఓటు బ్యాంక్  రాజకీయాలు వీరు చేస్తున్నారని, క్రైస్తవం, ఇస్లాం మాత్రమే మతాలని.. హిందూ మతం మతం కాదని అదొక జీవన విధానం అన్నారు వీర్రాజు. బీజేపీ ఎప్పుడూ మతపరమయిన ఓటు బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకం అన్నారు. పాస్టర్లకు ఇమాంలకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ ఇద్దరూ అన్నారు. బీజేపీలోకి వలసల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

అవినీతి అక్రమాల కేసులు వున్నవారిని తీసుకోకూడదంటే ఎలా ? మాపార్టీ కూడా బలపడాలి. మేం కూడా పరిపాలించాలని భావిస్తున్నాం మిగతా పార్టీల్లాగే తాము కూడా బలోపేతం కావాలని అనుకుంటున్నామన్నారు. ఏపీలో ఇంగ్లీషు మీడియం రచ్చ సాగుతున్నవేళ ఇంగ్లీషుకి అనుకూలంగా గతంలో వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదని, ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. 

వైసీపీ ఎంపీలు బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారని ..ఎంత మంది బీజేపీలోకి వస్తారనేది అప్పుడే చెప్పలేమన్నారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle