newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

చంద్రబాబు చెప్పేవన్నీ సీఎస్ చేయాలా?

01-05-201901-05-2019 10:46:21 IST
2019-05-01T05:16:21.732Z01-05-2019 2019-05-01T05:16:09.540Z - - 21-08-2019

చంద్రబాబు చెప్పేవన్నీ సీఎస్ చేయాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికలు ముగిశాక కూడా ఏపీలో రాజకీయ దుమారం చల్లారలేదు. ఎన్నికల కోడ్ పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎం చెప్పే ప్రతిపనిని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చేయక్కర్లేదని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ముఖ్యమంత్రికి సిఎస్ సలహాదారు మాత్రమేనని తెలపారు. ‘‘ఎల్వీ సుబ్రమణ్యంతో తాను కలసి పనిచేశానని, ఆయన చాలా నిబద్ధతతో పనిచేసే అధికారి అన్నారు. సిఎస్ పై నిందలు ఆపండి ఇది మంచిది కాదు’’ అని పేర్కొన్నారు. ఐఏఎస్ అంటే సీఎం చెప్పే ప్రతిపని చేయడం కాదని, చట్టప్రకారం పాలన నడుస్తుందా లేదా చూడడం అన్నారు ధర్మాన. 

చంద్రబాబు ఇటీవల వితండ వాదనలకు దిగుతున్నారని, పాలనలో తానే సీనియర్ అనే చెప్పే వ్యక్తికి అది తగదన్నారు. సక్సెస్ అయితే తన గొప్పతనం అని భావిస్తారని, తన వైఫల్యాలకు ప్రధాని నరేంద్రమోడీయే కారణం అని చెబుతుంటారని ధర్మాన ఆరోపించారు. గతంలో ప్రధానిని దేశంలో ఎవరూ ప్రశంసించనంతగా చంద్రబాబు ప్రశంసించారన్నారు.

జగన్‌ని చివరకు ఈవీఎంలను కూడా తప్పుపడుతున్నారని చెప్పారు. ఏపిలో ఈసి నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వాదన చేస్తోందన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం చెబుతుంది ఇదేనా అని ప్రశ్నించారు. ఎన్నికల విధులు నిర్వహించే యంత్రాంగానికి రాజ్యాంగం పూర్తి అధికారం ఇచ్చిందన్నారు.

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చినపుడు ఈసి ఆదేశాలు పాటించాలా.? లేక మీ ఆదేశాలు పాటించాలా? అని ప్రశ్నించారు. మన చట్టాలను గౌరవించక్కర్లేదని మీ పాలన తెలియచేసిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై మీకు నమ్మకం లేని విధంగా పాలన చేశారని అన్నారు. రాజ్యాంగం వ్యవస్దలను నాశనం చేశారని, స్పీకర్ వ్యవస్దను కూడా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఫలితాలు వచ్చేవరకూ ఈసీ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. దేశమంతటా కోడ్ అమలులో ఉందని, చంద్రబాబు ఒక్కరికే ఇబ్బందికలుగుతోందనడం దారుణం అన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle