newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

చంద్రబాబు కూటమికి ఎగ్జిట్ పోల్స్ షాక్?

20-05-201920-05-2019 08:31:32 IST
Updated On 21-05-2019 15:21:35 ISTUpdated On 21-05-20192019-05-20T03:01:32.606Z20-05-2019 2019-05-20T03:01:24.494Z - 2019-05-21T09:51:35.147Z - 21-05-2019

చంద్రబాబు కూటమికి ఎగ్జిట్ పోల్స్ షాక్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళలు ఆదరించారని, మళ్ళీ తమదే సర్కార్ అని భావిస్తున్న తెలుగుదేశం అభిమానులకు ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చాయంటున్నారు. తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం 135కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ గెలుపు తథ్యం అని తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ -టీడీపీ మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం ఉండబోతోంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్‌’ గెలుచుకోబోతోంది.

దేశవ్యాప్తంగా తుదివిడత పోలింగ్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియగానే ఎన్‌డీటీవీ, టైమ్స్‌ నౌ, రిపబ్లిక్‌ టీవీ ,జన్‌కీ బాత్, ఇండియాటుడే, మిషన్‌ చాణక్య, ఆరా, సీపీఎస్, ఏబీపీ నీల్సన్‌ మార్గ్‌ , సీఎన్‌ఎన్‌ న్యూస్‌ ,18, ఐ పల్స్, కేకే సర్వీస్‌  తదితర సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. 

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికార పగ్గాలు చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తేల్చి చెప్పడంతో తెలుగు తమ్ముళ్ళకు వడదెబ్బ తగిలినట్టయింది. ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130-135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది.

వైఎస్సార్‌సీపీ 133 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. దీంతో తమ అంచనాలన్నీ తలక్రిందులవుతున్నాయని తెలుగుదేశం నేతలకు రాత్రంతా నిద్ర కరువయిందంటున్నారు. 

అలాగే వైస్సార్‌సీపీ-టీడీపీ మధ్య ఓట్ల శాతంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని వివిధ సర్వేలు తేల్చాయి. వైఎస్సార్‌సీపీకి 50.1 శాతం, టీడీపీకి 40.2 శాతం, జనసేనకు 7.3 శాతం, ఇతరులకు 2.6 శాతం ఓట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే పేర్కొంది.  ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌  ఉండాలని 45 శాతం మంది కోరుకున్నట్లు వీడీపీ అసోసియేట్స్‌ విశ్లేషణలో తేల్చింది. 

‘చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఏదో జరగరాని అద్భుతం జరిగినట్లే....’ అంటూ అది అసాధ్యమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పేర్కొన్నారు. ‘మా ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తిగా ఎన్నికల ఫలితాలను ప్రతిఫలిస్తాయి. అత్యంత పకడ్బందీగా, అన్ని ప్రమాణాలతో శాస్త్రీయంగా నిర్వహించాం. ఏ ఫలితాలైనా ఒక పార్టీవారికే అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎగ్జిట్‌పోల్స్‌నే తప్పుబట్టడం సరికాదు’’అంటున్నారు  సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ సర్వే అధినేత ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌.

మొత్తం మీద మే 23 వ తేదీన రాబోయే ఫలితాలు వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచనున్నాయంటున్నారు. ఈ ఫలితాలను అప్పుడే బేరీజు వేసుకోలేమని, అసలు ఫలితాల రోజు అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు టీడీపీ నేతలు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle