newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చంద్రబాబు ఓటమిపై‘న్యూస్ స్టింగ్’ చెప్పిందే నిజమైంది!

31-05-201931-05-2019 08:38:04 IST
Updated On 25-06-2019 14:24:29 ISTUpdated On 25-06-20192019-05-31T03:08:04.330Z31-05-2019 2019-05-31T03:08:00.334Z - 2019-06-25T08:54:29.934Z - 25-06-2019

చంద్రబాబు ఓటమిపై‘న్యూస్ స్టింగ్’ చెప్పిందే నిజమైంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, నేతల అంచనాలు తలకిందులవుతాయని ‘న్యూస్ స్టింగ్’ ఎప్పటికప్పుడు తన కథనాల ద్వారా నిశితంగా చెబుతూనే ఉంది. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. తొడకొట్టి మరీ తమ పార్టీ విజయంపై నేలవిడిచి సాము చేశారు. కొన్ని మీడియా సంస్థల అతి పోకడలకు, భజనలకు చంద్రబాబు బొక్కబోర్లాపడ్డారు.

ఎన్నికల ముందునుంచీ పసుపుకుంకుమ, రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాలు అమలుచేసింది టీడీపీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసింది. నాలుగున్నరేళ్ళకు పైగా నిశ్శబ్దంగా ఉన్న చంద్రబాబు చివరి నిముషంలో వేసిన ఈ సొమ్ముని డ్రా చేసుకున్న మహిళా మణులు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అర్థరాత్రి వరకూ మహిళలు శ్రమను లెక్కచేయకుండా ఈవీఎంల ముందు నిలబడి ఓటు వేసింది తమకే అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

మహిళల ఓట్లు ఖచ్చితంగా తమకే పడ్డాయని టీడీపీ నేతలు ఎంతో సంబరపడ్డారు. మీడియా తమను తక్కువ అంచనా వేశారు. కానీ జరిగింది మాత్రం వారి అంచనాలకు అందలేదు. మహిళలు, రైతులు, శ్రామికులు, ఎస్సీఎస్టీలు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారు మార్పు వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఈవీఎంలన్నీ ఫ్యాన్ గాలిలో సేదతీరాయి. ప్రతి చోట వైసీపీ ప్రభంజనం కనిపించింది, 

విశ్వసనీయతకు,నిజానికి నిలువుటద్దం అని చెప్పుకునే ఒక మీడియా సంస్థ తాము చేసిన సర్వేని తిప్పి రాసింది. వైసీపీకి బదులు టీడీపీకి పట్టం కట్టింది. ఈ సర్వే చూసిన, చదివిన జనం ఇది మరో లగడపాటి సర్వే అని విమర్శించారు. టీడీపీకి విజయం ఖాయం అన్న ఆ మీడియా సర్వే.. నిజాన్ని దాచేసింది. 

ఈనేపథ్యంలో ‘బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1 -‘బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2’అంటూ ఏప్రిల్ 23న రాసిన కథనం అక్షరాలా నిజమైంది. సరిగ్గా నెలరోజుల తర్వాత ఫలితాలకు అద్దం పట్టింది. 

Image may contain: 8 people, people smiling

‘‘నాలుగేళ్ళు నిశ్శబ్దంగా ఊరుకుని డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో చెక్కులు ఇచ్చారు చంద్రబాబు. తాను పెద్ద కొడుకుగా, అన్నగా చేదోడువాదోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రకటనలు కూడా అదే విధంగా సాగాయి. ఈ ఎన్నికల్లో పసుపు కుంకుమ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని అక్కాచెల్లెళ్ళు తనకు ఓట్లను బహుమానంగా ఇస్తారని చంద్రబాబు పదేపదే చెప్పారు.

అంతే ఉత్సాహంగా ఎన్నికల్లో తిరిగారు. వృద్ధాప్య పింఛన్లు, పసుపుకుంకుమ, అన్నదాద సుఖీభవ, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు టీడీపీని మళ్ళీ అధికారంలోకి తెస్తుందని భావించారు. దీనికి తగ్గట్టుగా ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళల ఓట్లు తమకు సానుకూల ఫలితాలు వస్తాయని టీడీపీ నేతలు కొండంత నమ్మకంతో ఉన్నారు.’’ అని న్యూస్ స్టింగ్ రాసింది.

అంతేకాదు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది కేసీఆర్, జగన్ కాదని మహిళలే అని విశ్లేషించింది. పలువురు రాజకీయనేతలు, విశ్లేషకుల అభిప్రాయాలను కథనంలో అందించింది. ఈ వార్తా కథనంలో ‘‘ అందుతున్న సమాచారం, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్ళ నుంచి తమను పట్టించుకోలేదని, అందుకే తాము చంద్రబాబుకి ఊహించని నజరానా ఇస్తారంటున్నారు. అది రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఉంటుందని వారు చెబుతున్నారు. తమకు 2 లక్షల వరకూ అప్పు ఉందని, ఎన్నికలకు ముందు అదంతా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు సగం కూడా మాఫీ కాలేదంటున్నారు తెలుగింటి ఆడపడుచులు. అందుకే తాము చంద్రబాబుకి సర్ ప్రైజ్ ఇస్తామంటున్నారు’’ అని విశ్లేషించింది.

దూకుడుకి మారుపేరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని గెలుపుపై వెలిబుచ్చిన అభిప్రాయం నిజమైంది.  కచ్చితంగా గెలుస్తారని టీడీపీ భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. తనకు చాలా గట్టి పోటీ ఉందని, మైనస్‌లో ఉన్నానని పలువురు మీడియా ప్రతినిధుల ఎదుటే చెప్పడం వాస్తవానికి అద్దం పట్టిందని న్యూస్ స్టింగ్ కథనంలో అందించింది. 

పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి టీడీపీ నేతలలో ఇప్పుడు ఓటమి వణుకు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘనమైన ఫలితాలను అందించిన పశ్చిమగోదావరి వాసులు ఈసారి టీడీపీకి షాకివ్వబోతున్నారని రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రాయూనివర్శిటీ మాజీ పాలకమండలి సభ్యులు డా.గుబ్బల తమ్మయ్య అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయమే నిజమయింది.

విశ్వసనీయతకు, కచ్చితమైన సమాచారానికి, నిష్పాక్షిక విశ్లేషణకు ఇంతకు మించిన నిదర్శనం ఇంకేం కావాలి? న్యూస్ స్టింగ్ జరిగేదే చెబుతుంది. జరగబోయేదాన్ని కూలంకషంగా విశ్లేషిస్తుంది., ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా. అదీ ‘న్యూస్ స్టింగ్’మార్కు జర్నలిజం. మా కథనాలను విశ్వసించేవారికి, విలువైన సూచనలు చేసేవారికి మా ‘న్యూస్ స్టింగ్’ ఈమెయిల్ (newssting@rightfolio.in) తలుపులు తెరిచే వుంటాయి,  ‘న్యూస్ స్టింగ్’ ని ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి ప్రణామాలు. 

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1 కథనం కోసం క్లిక్ చేయండి

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2 కథనం కోసం క్లిక్ చేయండి

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle