newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

చంద్రబాబు ఓటమికి బాలయ్య సాయం?

13-06-201913-06-2019 17:52:13 IST
Updated On 22-06-2019 16:47:36 ISTUpdated On 22-06-20192019-06-13T12:22:13.492Z13-06-2019 2019-06-13T12:22:09.596Z - 2019-06-22T11:17:36.088Z - 22-06-2019

చంద్రబాబు ఓటమికి బాలయ్య సాయం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం వెనుక సినీ నటుడు బాలకృష్ణ పాత్ర కూడా ఉందా? అదేంటి బావ రాజకీయ జీవితం తల్లకిందులవ్వాలని ఏ బామ్మర్ది కోరుకుంటాడు? ‘బతుకు కోరేవాడే బావమరిది కదా’ అని అంటారా.. ఇక్కడ అలా జరగలేదు. తన సరదా తీర్చుకునేందుకు బావ భవితవ్యాన్నే బాలయ్య ఫణంగా పెట్టాడు. నమ్మలేకపోతున్నారా? కానీ, ఇది నిజం!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగడానికి సరిగ్గా 50 రోజుల ముందు నందమూరి నటసింహం బాలకృష్ణ డ్రీమ్ మూవీ-ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ విడుదలయ్యింది. తెలుగు వెండితెర చరిత్రలోనే అతి గొప్ప డిజాస్టర్‌గా సినీ పండితులు చెప్పుకునే ఈ చిత్రరాజమే చివరికి చంద్రబాబు పాలిటి శాపంగా మారింది. 

తన తండ్రి జీవితాన్ని వెండితెరపై చూసుకోవాలనుకునే కోరిక బాలయ్య మనసులో ఎలా పుట్టిందో కానీ, ఎన్నికల ముందు పాలిటిక్స్‌లో అది కాక పుట్టించింది. మహాకావ్యంగా నిలవాల్సిన మహనీయుడి జీవితచరిత్ర వివాదాస్పదంగా నిలిచింది. కారణం మరెవరో కాదు బాలయ్యే. అసలు ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని బాలయ్యబాబు సంకల్పించడమే ఒక దుస్సాహసం. ఈ ప్రకటన రాగానే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరిగింది.

స్వయంగా చంద్రబాబుకు వియ్యంకుడైన నందమూరి వారసుడు తన తండ్రి అంతిమ ఘడియల్లో ‘విలన్’గా భావించిన వ్యక్తిని ఎలా చూపించబోతున్నాడని తెలుగునాట తెగ మాట్టాడుకున్నారు.

తండ్రి బయోపిక్‌ను సినీ, రాజకీయ జీవితాలుగా రెండు భాగాలుగా తీస్తున్నట్టు ప్రకటించి బాలయ్య మరింత ఆసక్తిని కలిగించాడు. మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా వినిపించిన పేరు రామ్ గోపాల్ వర్మ. చాలా రోజులు ఆ పేరు మీడియాలో, జనం నోట్లో నలిగింది. ఎంచేతో వర్మ పేరు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బాలయ్య.. యువ ప్రేమ ఉద్రేకాలే కథాంశాలుగా తీసుకునే అలనాటి సంచలన దర్శకుడు తేజను దర్శకుడిగా ప్రకటించాడు.

Image result for మహానాయకుడు

తరువాత తేజ స్కూల్ నచ్చని బాలయ్య వెంటనే దర్శకుణ్ని మార్చేస్తున్నట్టు ప్రకటించి ఆ బాధ్యతను క్రిష్‌కు అప్పగించాడు. అప్పటికే హిందీలో మణికర్ణకను సగం తీసిన జాగర్లమూడి క్రిష్ బాలయ్య పిలుపుతో ఆ ప్రాజెక్టును అక్కడే వదిలేసి పరిగెత్తుకు వచ్చి ఎన్టీఆర్ బయోపిక్‌ మొదలుపెట్టాడు. ఇదంతా చూసి మండిన తలతిక్క వర్మ ఎన్టీఆర్ అసలు బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించి చంద్రబాబు శిబిరాన్ని ఎన్నికల ముందు వణికించాడు. ఆ క్రమంలోనే లక్ష్మీపార్వతి పాత్ర మళ్లీ జనం నోట్లో నానింది.

Image result for ఎన్టీఆర్ కథానాయకుడు

మామకు వెన్నుపోటు పొడిచాడని చంద్రబాబు గురించి వైఎస్, ఆ తరువాత జగన్ విమర్శించడమే కానీ, ఆ కథేంటే పెద్దగా తెలియని కొత్త జనరేషన్ ఓటర్లకు వైశ్రాయ్ కుట్ర ఎలా జరిగిందో వర్మ తన సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఈ సినిమా ఏపీలో రిలీజ్ కాకుండా టీడీపీ శ్రేణులు ఆడ్డుకోవడంతో అసలు వర్మ మూవీలో ఏముందోననే కుతూహలంతో ఆన్‌లైన్‌లో పైరసీ లింకులు తెగ వెతికి చూసేసిన వారికి చంద్రబాబులో మరోకోణం కనిపించింది.

Image result for లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

దాంతో కొత్తగా ఓటు హక్కు వచ్చిన యూత్... వెన్నుపోటుదారుడికి కాకుండా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఆలోచించి గంపగుత్తగా ఓటేశారని టాక్! అదీ బావ గారి ఓటమిలో బాలయ్య పాత్ర!!  

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle