newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

చంద్రబాబు ఓటమికి ఆయనే కారణమా?

24-05-201924-05-2019 17:02:38 IST
Updated On 26-06-2019 16:23:43 ISTUpdated On 26-06-20192019-05-24T11:32:38.407Z24-05-2019 2019-05-24T11:32:34.179Z - 2019-06-26T10:53:43.000Z - 26-06-2019

చంద్రబాబు ఓటమికి ఆయనే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు టీంని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేశాయి. గతంలో 102 సీట్లతో అమరావతిని ఏలిన పార్టీ నేడు 23 సీట్లకు పరిమితం కావడం బాబు స్వయంకృతాపరాధమేనా? ఎవరి వల్లనైనా ఇలాంటి ఫలితాలు వచ్చాయా? అంటే అనేక కారణాలు చెబుతున్నారు ఆపార్టీ నేతలు. ముఖ్యంగా వినిపిస్తున్నది ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేరు. షేర్ మార్కెట్‌లో ఉన్న త‌న ప్రతిభను రాజకీయాల్లోకి అన్వయించడం వల్ల ఈక్వేషన్ కుదరలేదు. 

రుణమాఫీ విషయంలో రైతుల‌ను దారుణంగా మోసం చేసిన కుటుంబ‌రావు చివ‌రిగా చంద్రబాబు కొంప ముంచేశాడు. రైతుల‌కు రుణాల‌ను మాఫీ చేస్తాన‌ని ప్రక‌టించి అధికారంలోకి వ‌చ్చిన‌ చంద్రబాబునాయుడు ఆ త‌ర్వాత ఆ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. ఆయ‌న వైఫ‌ల్యానికి ముఖ్య కారణం కుటుంబరావు ఐడియాలే అని అంటున్నారు. రైతుల‌కు తాను ఇచ్చిన హామీని ఎలా నెర‌వేర్చాలా అని కాకుండా రైతుల రుణాల‌ను మాఫీ చేయ‌డం ఎలా ఎగ్గొట్టాలో చెబుతున్న కుటుంబ‌రావు మాట‌లు విన్న చంద్రబాబునాయుడు ఆయన ట్రాప్‌లో పడిపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభవం ఈ విషయంలో ఏమైంది, రైతులను ఇబ్బంది పెట్టడానికి సవాలక్ష నిబంధనలు పెట్టారు. ఈ ని‘బంధనాలు’టీడీపీ ఓటమికి కారణంగా చెబుతున్నారు. 

2007 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2013 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ ఉన్నరైతుల రుణాల‌ను మాఫీ చేస్తామ‌నేది చంద్రబాబు ఆర్భాటంగా చేసిన ఎన్నిక‌ల హామీ. అయితే ఆ రుణాల‌ను మాఫీ చేయ‌క‌పోగా కుటుంబ‌రావు చేసిన ప‌నుల‌తో వారికి కొత్త రుణాలు పుట్టే అవ‌కాశం కూడా ఇప్పుడు పోయింది. ఇప్పుడు పంట‌లు వేసుకోవ‌డానికి బ్యాంకుల‌కు వెళుతున్న రైతులకు పైసా రుణం దొరికే అవ‌కాశం లేదు. దాదాపు 36 ల‌క్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారి నెత్తిన అస‌లు 60 వేల రూపాయ‌ల‌తో బాటు వ‌డ్డీ 15 వేల రూపాయ‌ల భారం ప‌డింది. మార్చి 31 వ‌ర‌కూ లెక్కలు చూసుకున్న బ్యాంకులు అవి క‌ట్టని వారిని డిఫాల్టర్ల జాబితాలో వేసేశాయి. 

ఇవేం పాపం రైతులకు తెలీదు. తమ రుణాల‌న్నీ మాఫీ అయిపోయాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో బ్యాంకుల నుంచి నోటీసులు రావ‌డంతో వారు కంగుతిన్నారు. ప‌సుపు కుంకుమ కాపాడుతుంద‌ని అనుకున్న చంద్రబాబునాయుడికి వెన‌క ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఒక్కో రైతుకు రుణ మాఫీ కింద క‌నీసం 75 వేలు రావాల్సి ఉండ‌గా దాన్ని డిఫాల్ట్‌లో పెట్టి వారి భార్యల‌కు ప‌సుపు కుంకుమ కింద 10 వేలు ఇచ్చారు. రైతుల రుణమాఫీని పట్టించుకోకుండా ఇతర కానుకలు ఇచ్చారు. 

రైతు రుణమాఫీకి సంబంధించిన సవాలక్ష లిటిగేషన్లు పెట్టారు. పొలం మీద రుణం కోసం బంగారం తాక‌ట్టు పెట్టినవారికి శ‌ఠ‌గోపం పెట్టారు. ఇలా 18 ల‌క్షల మంది రైతులు తమకు తెలియకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారని వారికి రుణమాఫీ వర్తించదని బ్యాంకులు తెలియజేశారు. దీంతో రైతులు శాపనార్థాలు పెట్టారు. అలాగే అనేక విధాలుగా నిబంధనలు పెట్టి రుణమాఫీ సరిగా అమలుకాకుండా చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది స‌హ‌కార బ్యాంకుల‌లో ఉంటుంది. దాన్ని తెచ్చి రుణ‌మాఫీకి అమ‌లు చేయ‌డంతో కొంప మునిగింది. మార్చి నెలాఖ‌రుకు రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయ‌డంతో వారికి కొత్త అప్పులు పుట్టే అవ‌కాశం లేకుండా పోయింది. కుటుంబరావుపై ఈరుణమాఫీ బాధ్యతలు అప్పగించడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle