newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి... కారణం అదేనా?

06-06-201906-06-2019 09:17:27 IST
Updated On 24-06-2019 16:01:48 ISTUpdated On 24-06-20192019-06-06T03:47:27.466Z06-06-2019 2019-06-06T03:47:19.050Z - 2019-06-24T10:31:48.572Z - 24-06-2019

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి... కారణం అదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు విదేశీ టూర్ ప్లాన్ చేశారు. వివిధ కారణాల వల్ల ఆ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. కుటుంబ స‌మేతంగా ఈ నెల 7 న వెళ్లాల్సిన ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కావ‌డంతోనే బాబు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయిందని చెబుతున్నారు.

మరోవైపు విప్ పదవి విషయంలో బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వహారంలో పార్టీలో విభేదాలు రావ‌డం, అలాగే శాస‌న స‌భ స‌మావేశాల కోసం ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేల‌ను స‌మాయాత్తం చేయ‌డం కోసం బాబు విదేశీ ప‌ర్య‌ట‌న  ర‌ద్దు చేసుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబునాయుడు రెండురోజుల క్రితమే ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇంటి పక్కన ప్రజా వేదిక ఉందని.. దానిని తన అధికారిక కార్యాకలాపాల కోసం కేటాయించాలని ఆయన లేఖలో కోరారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిలోనే తాను కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాడేపల్లిలోని అది ఒక ప్రైవేటు వ్యక్తికి చెందినది. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం దానికి సంబంధించిన అద్దె ప్రభుత్వమే చెల్లించింది. ఏపీ ప్రతిపక్షనేతగా తన అభ్యర్ధనను మన్నించాలని చంద్రబాబు కోరారు. 

తనను కలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు వస్తుంటారనీ, కాబట్టి పక్కనే ఉన్న ప్రజావేదికను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో చంద్రబాబు కోరారు. కాగా, ఈ లేఖ విషయమై ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు పార్టీనేతలు ఫలితాలతో అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను ఆకట్టుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది.

టీడీపీకి వచ్చిన మూడు ఎంపీ సీట్లలో ఎవరు చివరి వరకూ మిగులుతారోనని బాబు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా అసెంబ్లీ వ్యవహారాలు నిర్వహించనున్నారు. సభలో 151 సీట్లు సాధించిన జగన్ ఏ బిల్లునైనా సునాయాసంగా పాస్ చేయించుకోగలరు. ప్రమాణ స్వీకారానికి హాజరై తర్వాత సమావేశాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రీ టెండరింగ్, సీబీఐకి ఏపీలో ఎంట్రీ,... వంటి జగన్ తాజా నిర్ణయాలు కూడా చంద్రబాబుని టెన్షన్ పెడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle