newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

చంద్రబాబు ఇసుక దీక్ష.. వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

14-11-201914-11-2019 14:34:44 IST
Updated On 14-11-2019 15:28:07 ISTUpdated On 14-11-20192019-11-14T09:04:44.964Z14-11-2019 2019-11-14T09:04:43.335Z - 2019-11-14T09:58:07.521Z - 14-11-2019

చంద్రబాబు ఇసుక దీక్ష.. వైసీపీ నేతల తీవ్ర విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ నడిబొడ్డున ధర్నాచౌక్ లో దీక్షకు దిగారు. వరదల కారణంగా ఏపీలో ఇసుక కొరత అని వైసీపీ ప్రభుత్వం కొత్త సాకు చెబుతోందన్నారు చంద్రబాబు.

గత 50 ఏళ్ళలో వరదలు రాలేదా? ఈ ఏడాది పక్క రాష్ట్రాలకూ వరదలొచ్చాయి కదా? మరి చరిత్రలో లేని, పక్క రాష్ట్రాలలో లేని ఇసుక కొరత జగన్ గారి పాలనలోనే ఎందుకొచ్చింది? అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ నిర్ణయాల కారణంగా 5 నెలల నుంచి 30 లక్షల మందికి పైగా కార్మికులు నెలకు సరాసరిన రూ.20 వేల ఆదాయం కోల్పోయారని.. వారిని ఆదుకోవాలన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికునికి ఉపాధి దొరికే వరకు నెలకు రూ.10 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబునాయుడు. ఈ ఇసుక దీక్షకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

ఇసుక కొరతను ప్రశ్నిస్తే వైసీపీ మంత్రులు, నేతలు వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. సీఎంవి అవినీతికి దోహదం చేసే ఆలోచనలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇసుకతో వైసీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఇదేంటని ప్రశ్నించినవారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. గతంలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక లభిస్తే.. ఇప్పుడు కేజీల చొప్పున కొనాల్సి వస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు ఇసుక కొరత విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 

మరోవైపు చంద్రబాబు దీక్షపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ మంత్రులు, నేతలు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు దీక్షపై తీవ్రంగా మండిపడ్డారు.  ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం వారోత్సవాలు చేపడుతుంటే.. ప్రతిపక్షనేత చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు తమ్మినేని. తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుకోడానికి  దొంగ దీక్షలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు. 

చంద్రబాబు దీక్షపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వరదలు తగ్గిన కారణంగా ఇసుక తీయడం ఎక్కువైందని.. ప్రస్తుతం సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. ఇసుక దీక్ష పేరిట చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. ఇందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని చురకలు అంటించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle