newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

13-11-201913-11-2019 17:34:34 IST
Updated On 13-11-2019 17:34:19 ISTUpdated On 13-11-20192019-11-13T12:04:34.669Z13-11-2019 2019-11-13T12:03:47.341Z - 2019-11-13T12:04:19.299Z - 13-11-2019

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు గురువారం 12 గంటల పాటు విజయవాడలో దీక్ష చేయనున్నారు. విజయవాడలో ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతు కూడగడుతున్నారు టీడీపీ నేతలు. ఈదీక్షకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసిన టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు కోరారు. 

దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. తమ పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఇసుక కొరతకి సంబంధించి ఎవరు నిరసన తెలిపినా మద్దతిస్తామని పవన్ తెలిపారని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ తప్పులను గుర్తు చేస్తే వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. 

గవర్నర్ ని కలిసిన తర్వాత పవన్ ప్రెస్ మీట్ పెడితే వెంటనే ఒక మంత్రి ఒంటికాలి మీద లేచారని, పవన్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారని విమర్శించారు. ఇక విజయవాడలో చంద్రబాబు దీక్షకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, దీక్షలో ఎవరు పాల్గొంటారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదన్నారు అచ్చెన్నాయుడు.

మరోవైపు  రేపటి దీక్షను విజయవంతం చేయాలని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపటి దీక్ష అన్నారు చంద్రబాబు. గుంటూరు, విజయవాడలనుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారని, శాండ్ మాఫియాగా ఏర్పడి దోపిడి చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.  

వైసీపీ అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే 50మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనం అన్నారు. ఈ తరహా ఆత్మహత్యలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో ఇసుక, సిమెంటు,మద్యం రేట్లు బాగా పెంచేశారన్నారు. వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా టే ‘జె ట్యాక్స్’ కట్టాలన్నారు చంద్రబాబు. 

అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేత కారణంగా రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేయాలన్నారు. సమస్యను పరిష్కరించమని అడిగితే వైసీపీ నేతలు, మంత్రులు ఎదురుదాడికి దిగడం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షపై వైసీపీ నేతలు మండిపడ్డారు.

ఇసుక కొరతపై చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి ఎద్దేవా చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేకుంటే చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

మరో వైసీపీ నేత కిల్లి కృపారాణి చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లాలోని నది భూగర్భాలలో ఇసుక తవ్వేసి.. రాబందుల్లా దోచేశారని, ఏ వంక దొరక్క ఇసుకపై పడ్డారని కృపారాణి మండిపడ్డారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle