చంద్రబాబు అమరావతి టూర్.. వైసీపీ నిరసనల హోరు
28-11-201928-11-2019 10:09:16 IST
2019-11-28T04:39:16.566Z28-11-2019 2019-11-28T04:39:06.882Z - - 15-12-2019

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనపై వైసీపీ నిరసనలకు దిగుతోంది. ఇప్పటికే అమరావతి భూముల్లో నల్ల జెండాలు పాతింది, అక్కడి రైతులు రెండువర్గాలుగా చీలిపోయారు. చంద్రబాబు పర్యటనకు ఓ వర్గం మద్దతు తెలుపుతోంది. అమరావతిలో చంద్రబాబు శంఖుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్ర.బాబు తన ప్రస్తుత అమరావతి పర్యటన ప్రారంభించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె డిమాండ్ చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు టూర్ పై ఎమ్మెల్యే ఆర్కె హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పేద రైతుల భూములు ఏ విధంగా తన మనుషులకు దోచిపెట్టారో చంద్రబాబు చెప్పి, తన పర్యటన కొనసాగించాలన్నారు. రాజధాని కోసం బాబుని నమ్మి భూములిచ్చిన రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. కౌలురైతులకు, చేతి వృత్తి దారులకు రాజధానిపేరుతో బాబు చేసిన అన్యాయంపై ఆర్కె మండిపడ్డారు. తన ఐదేళ్ళ పాలనా కాలంలో చంద్రబాబు అమరావతిలో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదన్నారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఖర్చుపెట్టారో చెప్పాలన్నారు. కేంద్రానికి ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ లు ఇవ్వలే బాబు వివరించాలన్నారు. భూములివ్వని రైతులను బాబు వేధించారని, వారిపై కేసులు పెట్టించారని, వారిని హింసించారని ఆర్కె ఆరోపించారు. రాజధాని అమరావతిలో నిర్మాణవ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500/- అవుతుంటే...ఇసుక,భూమి..ఉచితంగా ఇచ్చి, చదరపు అడుగు రూ.15వేలకు ఎందుకు ఇచ్చారో బాబు తన పర్యటన కొనసాగించాలన్నారు. పేద,దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రైవేటు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌లో ఆ నలుగురూ ఒక్కటవుతున్నారట..!
2 hours ago

జగన్ ఎఫెక్ట్.. ఫుల్ బిజీగా ప్రశాంత్ కిషోర్..!
2 hours ago

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
3 hours ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019
ఇంకా