newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

చంద్రబాబులో మార్పు రాదా? సానుభూతి నుంచి బయటపడేదెప్పుడు?

05-07-201905-07-2019 10:08:48 IST
Updated On 05-07-2019 16:02:45 ISTUpdated On 05-07-20192019-07-05T04:38:48.956Z05-07-2019 2019-07-05T04:38:39.319Z - 2019-07-05T10:32:45.242Z - 05-07-2019

చంద్రబాబులో మార్పు రాదా? సానుభూతి నుంచి బయటపడేదెప్పుడు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంకా ఓటమి ట్రాన్స్ నుంచి బయటపడడంలేదు. తాను ఎందుకు ఓడిపోయానో తనకే అర్థం కావడం లేదంటూ గత నెలరోజుల నుంచి చెబుతూనే ఉన్నారు.

పైగా ఈయన్ని మోసే ఆ రెండుమూడు పత్రికలు కూడా అదే ధోరణితో ఉన్నాయి. తాను ఎన్నో పథకాలు చేపట్టానని, దేశంలో ఎక్కడా అమలుకాని సంక్షేమపథకాలు అమలుచేశానని చెబుతున్నారు. కాకి పిల్లకాకికి ముద్దు అన్నట్టుగా, ఆయన పథకాలు ఆయన మానస పుత్రికలుగా ఉండవచ్చు. కానీ ఇవి ప్రజలకు ఎంతవరకూ నచ్చాయి అనేది ఆయన ఆలోచించడంలేదు.

ఆయన్ని ఓదార్చడానికి వచ్చే మహిళలు, నేతలను చూసి తనకు ఎంతో మద్ధతు లభిస్తోందని ఆయన భావించి ఉండవచ్చు. అలిపిరి ఘటన తర్వాత కూడా ఆయన ఇదే ధోరణితో వ్యవహరించారు. తనకు సానుభూతి బాగుందని భావించారు. ఈ సమయంలోనే ఎన్నికలకు వెళితే తనకు మళ్లీ ప్రజల మద్ధతు లభిస్తుందని అంచనాకు వచ్చారు.

ఈయన కూడా తిరిగే నేతలు కూడా చంద్రబాబు చెప్పిన దానికి వంత పాడారు. తనతో పాటు అప్పటి ప్రధాని వాజ్ పేయిని కూడా ఒప్పించి, ముందస్తుకి వెళ్ళారు. ఆయనతో పాటు వాజ్ పేయి కూడా అడ్డంగా మునిగిపోయిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం. 

Image result for chandrababu

అనేక రాష్ట్రాలకంటే ఏపీ ముందుందని, తమది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పదే పదే టెలికాన్ఫరెన్సులలో బాకా ఊదారు. ఇంతచేసినా ఎన్నికల్లో ఓడిపోయామని.. కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అంటూనే కార్యకర్తల అభిప్రాయాలను మాత్రం ఆయన స్వీకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పార్టీపరంగా.. ప్రభుత్వ పరంగా తప్పిదాలు ఏం జరిగాయి? కార్యకర్తలు-నేతలకు మధ్య సమన్వయం ఎక్కడ చెడింది? ప్రజల్లో నిజంగానే టీడీపీ పట్ల అంత వ్యతిరేకత ఉందా? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఒక ఛాన్స్‌ ఇవ్వాలనుకున్నారా? అనే అంశాలపై ఫోకస్ పెట్టడం లేదు. తనను ఓదార్చడానికి వచ్చే నేతల మాటలకు చంద్రబాబు బాగా ఫీలవుతున్నారు.

ఈ ఐదేళ్ళు పార్టీని ఎలా కాపాడుకోవాలి? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పడం దేనికి సంకేతం. రాష్ట్రంలో టీడీపీనే ప్రత్యామ్నాయమని..వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని చంద్రబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని..నెలరోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని చంద్రబాబు చెబుతున్నారు.

ఒక ప్రభుత్వం జయాపజయాలు 30 రోజులను ప్రాతిపదికగా తీసుకోవడం సమంజసం కాదని గ్రహించాలి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబు తెలుసుకోవడం లేదని టీడీపీ సీనియర్ నేతలే కామెంట్లు చేస్తున్నారు.సమీక్షా సమావేశాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. 

ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని పార్టీ అధినాయకత్వం కూడా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఒకరిద్దరు సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనా.. వారిని మార్చకుండా మళ్లీ టికెట్లు ఇవ్వడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోయారని వారు చంద్రబాబుకి చెప్పారు.

మీడియాను సైతం అనుమతించకుండా అంతర్గతంగా సమీక్ష నిర్వహించడం కూడా టీడీపీకి మైనస్ అవుతోంది. ఈ లోపాలను చంద్రబాబు సరిదిద్దుకుంటారా? లేక తనదగ్గరకు వచ్చి మీరు ఓడిపోవడం ఏంటని సానుభూతి కన్నీళ్ళకు కరిగిపోతారా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle