newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చంద్రబాబుపై సీబీ‘ఐ’.. గవర్నర్‌తో రాయబారం

08-06-201908-06-2019 08:07:10 IST
Updated On 24-06-2019 14:51:59 ISTUpdated On 24-06-20192019-06-08T02:37:10.557Z08-06-2019 2019-06-08T02:37:03.972Z - 2019-06-24T09:21:59.533Z - 24-06-2019

చంద్రబాబుపై సీబీ‘ఐ’.. గవర్నర్‌తో రాయబారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సీబీఐని తలుచుకుని ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో సీబీఐ ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ దాడులు చంద్రబాబును బేంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.

అధికారంలో ఉన్న బీజేపీతో విభేదించి చాలా ముందుకు పోయిన చంద్రబాబు ప్రస్తుతం టెన్షన్ గా ఉన్నారని సమాచారం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో బీజేపీ మళ్ళీ తిరిగిరావడం.. రెండో కారణం తన పార్టీ ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం లాంటి కారణాలతో బాబు భయపడుతున్నారని జోరుగా  ప్రచారం జరుగుతోంది.

ఏపీ సీఎంగా ఉన్న టైంలో బాబు తనను, తన సహచరులను ఇబ్బందిపెట్టేందుకు బీజేపీ కుట్రపూరితంగా సీబీఐని వాడుకుంటుందని రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ప్రస్తుతం సీఎం జగన్ చంద్రబాబు చేసిన జీవోని రద్దు చేసి సీబీఐని రాష్ట్రంలోకి స్వాగతించారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు అండ్ కో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. గతంలోనే బీజేపీ తనను టార్గెట్ చేయకుండా రామోజీరావు ద్వారా చంద్రబాబు రాజీ ప్రయత్నం చేశారని కానీ ఆ రాజీ ప్రయత్నం బెడిసి కొట్టిందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. 

కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ద్వారా కూడా చంద్రబాబు బీజేపీతో రాజీ ప్రయత్నం చేశాడని కానీ ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని బీజేపీ ససేమిరా ఒప్పుకోలేదనే వార్తలు బలంగా వినబడుతున్నాయి.

దీంతో చివరి ప్రయత్నంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ద్వారా రాజీ ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వీరి భేటీ దాదాపు ఒకటిన్నర గంటకు పైగా సాగింది. కానీ బాబు మాత్రం మీడియా ముందుకు రాలేదు.  భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశం అవుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle