newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

చంద్రబాబుపై లక్ష్మీ‘బాంబ్’

13-02-201913-02-2019 12:56:07 IST
Updated On 13-02-2019 17:18:55 ISTUpdated On 13-02-20192019-02-13T07:26:07.266Z13-02-2019 2019-02-13T07:25:07.149Z - 2019-02-13T11:48:55.557Z - 13-02-2019

చంద్రబాబుపై లక్ష్మీ‘బాంబ్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మరోసారి ఏపీ సిఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ఆయనిచ్చిన 650 హామీల్ని తుంగలోకి తొక్కేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా అవినీతికి చిరునామాగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు మాత్రమే ఉంటే... అంతకుమించి ఉన్న రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానంటూ అబద్ధపు హామీలిచ్చారని మండిపడ్డారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ఆరున్నర లక్షలకోట్లు అప్పు తెచ్చామని డప్పు కొట్టుకుంటున్న బాబు... ఆ డబ్బులు ఏం చేశారంటూ నిలదీశారు. ఇదంతా తాము కల్పించి చెప్పడం లేదని, నిఘా వర్గాలే రిపోర్ట్‌లతో సహా టిడిపి బండారాన్ని బయటపెట్టాయన్నారు. స్కీమ్‌ల పేరుతో ఎన్నో వేల కోట్లు దోచేశారని, ఇప్పుడు ఓట్ల కోసం ఏవేవో పథకాలతో ఊరిస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. గత హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తి చేయని చంద్రబాబుని మీరు నమ్ముతారా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు.

తన దగాకోరు విధానాలతో ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు ఎలెక్షన్ స్టంట్స్‌కి పాల్పడుతున్నారని, ఆయన్ను నమ్మొద్దంటూ పిలుపునిచ్చారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని భజన చేసుకునే బాబు... 40 ఏళ్ళ జగన్ ప్రకటించిన నవరత్నాల్ని కాపీ కొడుతున్నారని విమర్శించారు. కాలేజ్‌లో కాపీ కొడ్తే ప్రిన్సిపాల్ డీ-బార్ చేసినట్లుగానే... జగన్ పథకాల్ని కాపీ కొడ్తున్న చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో డీ-బార్ చేయాల్సిందిగా జనాన్ని కోరారు.

మొదట్లో ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన చంద్రబాబు... ఆ తర్వాత యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతున్నారన్నారు. హోదా గురించి మాట్లాడితే జైల్లో పెడతానని చెప్పిన బాబు... ఇప్పుడు తామే మొదట్నుంచి దానికోసం పోరాడుతున్నట్లు పిచ్చివేషాలేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో టిడిపి ఎంపీలు వేస్తున్న ‘వేషాలు’ చూసి... నేషనల్ మీడియా నవ్వుతోందని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగుదేశం పుడితే... అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపి టిడిపి పరువు తీసేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌పై వస్తున్న మరో బయోపిక్ గురించి మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడినే (ఎన్టీఆర్) కూలదోసిన చంద్రబాబు మోసాల్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వర్మ చూపించబోతున్నారని వెల్లడించారు. ‘అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు నారాలోకేష్ తండ్రిని మించి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలారని లక్ష్మీపార్వతి చురకలంటించారు. కరువుతో కటకటలాడుతున్న అనంతపురంలో రెయిన్ గన్స్‌తో వర్షాలు కురిపించామని చంకలు గుద్దుకుంటున్నారని... మరి అక్కడి రైతులు ఎందుకు వలసపోతున్నారని కడిగేశారు.

స్వయంగా ఎన్టీఆరే చంద్రబాబు లాంటి నీచుడ్ని దరిచేరనివ్వొద్దని చెప్పారని... నిజమైన ఎన్టీఆర్ అభిమానులు వచ్చే ఎన్నికల్లో ఆ పని చేసి చూపిస్తారని తాను నమ్ముతున్నానని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. పులి కడుపున పులే పుడుతుందన్నట్లుగా వైఎస్ఆర్‌కు జగన్‌లాంటి తనయకుడు పుట్టారని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు నిలబడాలంటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాల్సిందేనని ఆమె జోస్యం చెప్పారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle