newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

చంద్రబాబుపై నిందలేస్తే ప్రజలు కష్టాలు తీరేనా?

25-10-201925-10-2019 11:07:30 IST
2019-10-25T05:37:30.419Z25-10-2019 2019-10-25T05:37:27.131Z - - 20-11-2019

చంద్రబాబుపై నిందలేస్తే ప్రజలు కష్టాలు తీరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుంది. వైసీపీ నేతలు, సాక్షాత్తు మంత్రులే ఆ మాట పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతుండగా ప్రభుత్వం అందుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేయలేదన్నది నిపుణుల వాదన. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్ర లోటులో పడిపోయిందని ప్రభుత్వమే చెప్తున్నా అందుకు పరిష్కారం ఏమిటంటే మాత్రం గత ప్రభుత్వ విధానాలు, అవినీతి, దుబారాలు అని విమర్శలు చేసి, కమిటీ వేసి విశ్లేషిస్తామంటున్నారే తప్ప ఆదుకొనే విధానం ప్రభుత్వం దగ్గర లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులు, విద్యుత్ కోత, ఇసుక కొరత, రాజధాని ప్రతిష్టంభన, వ్యవసాయ విత్తనాల కొరత ఇలా ఒకటేమిటీ ప్రతిదీ గత ప్రభుత్వం మీద తిట్ల దండకం అందుకుంటున్నారే తప్ప తామిది చేసి కష్టాలు తీరుస్తామని హామీ ఇవ్వడం లేదు. అవసరమైతే కమిటీలు.. తర్వాత సమీక్షలు.. చివరికి ఆరోపణలు.. అవినీతి అనే బూచిని చూపించడం. ప్రభుత్వం ఏర్పాటై ఆరునెలలు గడుస్తున్నా వందలకొద్దీ ఆరోపణలు చేసినా ఒక్కటీ నిరూపించిన పరిస్థితి లేదు.

కేంద్రం రాష్ట్ర పరిస్థితిఫై ఇచ్చిన గణాంకాలపై ప్రశ్నించే గత ప్రభుత్వం అప్పులపాలు చేసిందని విమర్శలు అందుకున్న మంత్రులను తిరిగి.. గత ప్రభుత్వం ఏడాదికి రూ22 వేలకోట్లు చేస్తే మీరు.. ఆరునెలలలోనే రూ28 వేల కోట్లు చేశారు కదా అని ప్రశ్నిస్తే మేము ప్రజాసంక్షేమం కోసమే చేస్తున్నామని సమాధానం. ప్రభుత్వమే మీ చేతిలో ఉండగాగత ప్రభుత్వం దుబారా చేసిందని అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎందుకు.. నిరూపించమంటే చూస్తున్నాం.. చేస్తున్నాం అని సమాధానాలు.

గత ప్రభుత్వమే కారణమంటే ఇప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయా? రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ పతనానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలేస్తే ఇప్పుడు ఆర్థికవృద్ధి పెరుగుతుందా? ఏడాదికి ఇరవైవేలకోట్లు అప్పులు చేసినా నిరంతర విద్యుత్ అందించారు.. కేంద్ర ప్రభుత్వం నుండి పదుల సంఖ్యలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులకు అవార్డులు అందుకున్నారు. ఆర్థికవృద్ధిని అభివృద్ధి చెందిన రాష్టాలకు పోటీపడేవిధంగా ముందుకు తీసుకెళ్లారు. సంక్షేమ పథకాలలో కూడా పొరుగు రాష్ట్రాలకు పోటీ ఇచ్చారు.

మరి సగం ఏడాదికే అంతకు మించి అప్పులు చేసిన వైసీపీ సర్కార్ మిగతా అన్ని విషయాలలో తిరోగమనం ఎందుకు పడుతుంది అన్నది ప్రభుత్వ పెద్దలు విశ్లేషించుకోవాల్సిన విషయం. ఈ ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టిన సంక్షేమ పథకాలకు కూడా అన్నీ అరకొర నిధులే కేటాయించగా భవిష్యత్ లో ఈ ఆర్ధిక పరిస్థితి సంక్షేమ పథకాలను ఎలా కొనసాగించాలని భావిస్తుంది? నిధులను ఎక్కడ నుండి రాబట్టాలని ఆలోచిస్తుందో ఆర్ధికం వేత్తలకు సైతం అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

ఇసుక లాంటి ఖర్చులేని సమస్యను తీర్చేందుకు కూడా నానా తిప్పలు పడుతున్న ప్రభుత్వం ఆర్ధిక వ్యవ్యస్థను గాడిలోపెట్టే మంత్ర దండం ఏంటి అన్నది తెలుసుకోవాలనుకోవడం ఇప్పట్లో జరిగేపనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమంటే ఓ యంత్రాంగం.. అన్ని ఆయుధాలు తన చేతుల్లోనే ఉండే ఓ వ్యవస్థ గత చరిత్రను బూచిగా చూపిస్తే మరింత కాలం మనుగడ సాగించలేవనేది నగ్న సత్యం. మరి ఆ సత్యాన్ని జగన్ సర్కార్ గ్రహిస్తుందా? తత్వం బోధపడేలోగా రాష్ట్రానికి సానుభూతే మిగులుతుందా?!!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle