newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

చంద్రబాబుపై తలసాని ఘాటు విమర్శలు... జగన్‌పై ప్రశంసలు

16-01-202016-01-2020 09:01:56 IST
2020-01-16T03:31:56.444Z16-01-2020 2020-01-16T03:30:54.948Z - - 22-01-2020

చంద్రబాబుపై తలసాని ఘాటు విమర్శలు... జగన్‌పై ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పటి చంద్రబాబు అనుంగు మిత్రుడు, తెలంగాణ టీడీపీలో కీలకంగా వ్యవహరించిన తలసాని శ్రీనివాసయాదవ్ అవసరం అయినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శల దాడి సాగిస్తూనే వున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చంద్రబాబుని టార్గెట్ చేసి విజయవాడ నడిబొడ్డులో విమర్శలు చేశారు. ఎన్నికల్లో జగన్ గెలుపు తర్వాత కూడా తరచూ చంద్రబాబుని తిడుతూనే వున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా కోడిపందేల్లో పాల్గొన్న తలసాని సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో చంద్రబాబు విధానాలను తూర్పారబట్టారు.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడిపందేల్లో పాల్గొన్నారు తలసాని. ఈ సందర్భంగా అమరావతి ఆందోళనలపై తనదైన రీతిలో స్పందించారు. చంద్రబాబు పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య తలెత్తిందని కామెంట్లు చేశారు. 

ఏపీ రాజధాని విషయంలో  శాశ్వత పరిష్కారం ఉండాలని తాము కూడా కోరుకుంటున్నామన్నారు. తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి తలసాని శ్రీనివాస్ సందడి చేశారు. స్థానికులతో కలిసి కోడి పందేలలో పాల్గొన్నారు. తలసానితో పాటు వైసీసీ నాయకులు పాల్గొన్నారు.

అమరావతి వీధుల్లో జోలె పట్టుకొని భిక్షమెతుకునే నాయకులను నమ్మకండని చంద్రబాబుని ఉద్దేశించి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల రైతులంతా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని విషయంలో రైతులకు కొంత ఆందోళన ఉంది.

ప్రభుత్వంలో చర్చలు జరపాలన్నారు. సీఎం జగన్ పథకాలను ప్రశంసించారు తలసాని.  స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి మంచి ఫలితాలే వస్తాయన్నారు. ఏటా సంక్రాంతి పండగకు ఇక్కడకు వస్తానని, తనకు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ అంటే ఇష్టమన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle