newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

చంద్రబాబుపై కోపమే అమరావతికి శాపమైందా?

24-10-201924-10-2019 09:00:55 IST
Updated On 24-10-2019 13:12:44 ISTUpdated On 24-10-20192019-10-24T03:30:55.972Z24-10-2019 2019-10-24T03:30:47.509Z - 2019-10-24T07:42:44.876Z - 24-10-2019

చంద్రబాబుపై కోపమే అమరావతికి శాపమైందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవ్యాంధ్ర ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి. అంతర్జాతీయ స్థాయి నగరాలకు ఏ మాత్రం తగ్గకుండా మౌలిక వసతుల దగ్గర నుండి పరిపాలన అవసరాలకు మించి ఈ నగరాన్ని నిర్మించాలన్నది గత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కల.

తెలంగాణ నుండి విడిపోయాక రాజకీయ కారణాలతోనే విజయవాడకు పయనమైన చంద్రబాబు రాజధాని విషయంలో మాత్రం రాజీపడేదిలేదని విశ్వనగరం చేసి చూపిస్తామని ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. ఆ దిశగా అయన అడుగులు కూడా మొదలుపెట్టారు.

రాజధాని ప్రణాళికలకు, నమూనాలకు సరిగ్గా రెండేళ్ల సమయంతో పాటు వందల కోట్ల రూపాయలను వెనుకాడకుండా ఖర్చు పెట్టేశారు. అంతర్జాతీయ స్థాయిలోనే అండర్ గ్రౌండ్ కేబుల్, గ్యాస్ సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు కాస్త సంప్రదాయాన్ని మేళవించిన అత్యాధునిక టవర్ల నిర్మాణానికి నమూనాలను ఆమోదించారు.

ముందుగా తాత్కాలిక భవనాలను నిర్మించి అమరావతికి ఒక రూపునిచ్చి సంపూర్ణ అమరావతి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి మొదలుపెట్టారు. ఈలోగా ఎన్నికలొచ్చి అధికారం చేతులు మారింది.

ప్రస్తుతం రాజధానిలో మొదలుపెట్టిన ఒక్క నిర్మాణం కొనసాగడం లేదు. అక్కడ నిర్మాణరంగంలో పనిచేస్తున్న సంస్థలన్నీ అక్కడ నుండి తరలివెళ్ళిపోయాయి. కార్మికులు, ఉద్యోగులు కూడా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం రాజధాని నాలుగు మండలాలలో అంత నిర్మానుష్యం. మొదలైన అన్ని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో ప్రభుత్వం సొంత నిధులతో కొన్న నిర్మాణ యంత్రాలు శిధిలమైపోతున్నాయి. రాజధాని కోసం సేకరించిన భూమిలో పిచ్చి మొక్కలు చెట్లుగా మారి మానులైపోతున్నాయి.

ప్రస్తుతం అసలు అమరావతి అనే రాజధాని నగరం అసలు అక్కడ ఉంటుందా? ఉండదా? అన్న సందేహం ఏపీ ప్రజలలో బలంగా కదలాడుతుంది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం సూటిగా సమాధానమే చెప్పడం మానేసింది. ఈ క్రమంలో చంద్రబాబు తనపై కోపంతోనే రాజధానిని చెట్టెక్కించేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

మరి నిజంగానే ఆయనపై కోపంతోనే జగన్ అమరావతిని ఆపేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ నిజానికి రాజధాని నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఎలాంటి వాగ్దానాలు ఇవ్వలేదు. ఎక్కడా ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రజలకు చెప్పలేదు.

ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రలో కానీ.. ఎన్నికల ప్రచారంలో కానీ ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని ఎక్కడా చెప్పలేదు. ఒకదశలో టీడీపీ.. అధికారమిస్తే వైసీపీ అమరావతిని చంపేస్తుందని ఆరోపణలు చేస్తే జగన్ ఆ సమయంలో కేవలం రాజధానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే చెప్పారు.

ఏపీ ప్రజలు రాజధాని అవసరమే లేదని ఓట్లేశారా? అంటే దానిని మించి ఒక్క అవకాశం.. నవరత్నాలకు ఆకర్షితులయ్యారు. ప్రజలకు తగ్గట్లే జగన్ కూడా ఇప్పుడు మాయచేసో.. మతలబు చేసో వాగ్దానాలను అమలు చేశామని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అమరావతి విషయానికి వస్తే ప్రపంచస్థాయి రాజధాని అన్నది చంద్రబాబు నాయుడి కల. దానికి జగన్ నిజం చేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు.

కానీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఎక్కడా రాజధాని పేరు చెప్పి ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయలేదు. మరి ప్రభుత్వం ప్రారంభించిన రాజధానిని ప్రభుత్వమే పూర్తి చేయాలి కదా అంటారా? నిజమే చేయాలి? కానీ ఎక్కడా నిర్ణిత గడువు లేదు కదా అంటారు వైసీపీ నేతలు.

ఏది ఏమైనా ప్రపంచస్థాయి రాజధాని అన్నది వైసీపీ ప్రభుత్వం భుజానికెత్తుకుంటుంది అన్నది కల. అయితే కనీసం అడ్మినిస్ట్రేషన్ స్థాయి రాజధాని అయినా నిర్మించాలనుకోకపోవడం జగన్ సర్కార్ చేస్తున్న అతిపెద్ద తప్పుగా విశ్లేషకులు చెప్తున్నారు.

చివరికి కనీసం అసలు రాజధాని అన్నది అమరావతిలోనే ఉంటుందా.. ప్రభుత్వంలో కొందరు చేస్తున్న లీకుల మాదిరి తరలిపోతుందా? అన్నదానిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ప్రజలకు చేస్తున్న ద్రోహంగానే భావించాలి. అమరావతి విశ్వనగరానికి బాబుపై కోపమే శాపమైందో లేదో కానీ ప్రజలే తమకు ఆ స్థాయి వద్దనుకున్నారని అనుకోవాలేమో! ప్రజలు ఏ అభిప్రాయంతో ఒక్క అవకాశం ఇచ్చారన్నది బహుశా మళ్ళీ ఎన్నికల వరకు తేల్చలేని అంశమేనేమో!!

హైకోర్టుని తాకిన కరోనా వైరస్

హైకోర్టుని తాకిన కరోనా వైరస్

   4 minutes ago


జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం... ఇంకో వివాదం మొద‌లైన‌ట్లే..!

జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం... ఇంకో వివాదం మొద‌లైన‌ట్లే..!

   13 minutes ago


కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

   36 minutes ago


ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

   14 hours ago


 అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

   14 hours ago


అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

   20 hours ago


మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

   21 hours ago


ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   a day ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   a day ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle