newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

చంద్రబాబును నిలదీసింది అమరావతి రైతులేనా?

27-11-201927-11-2019 11:33:13 IST
Updated On 27-11-2019 12:30:05 ISTUpdated On 27-11-20192019-11-27T06:03:13.074Z27-11-2019 2019-11-27T06:03:10.638Z - 2019-11-27T07:00:05.070Z - 27-11-2019

చంద్రబాబును నిలదీసింది అమరావతి రైతులేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లు రాజధాని రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారంటూ టీడీపీ అధ్వర్యంలో అమరావతి రైతులు ధర్నాలు నిర్వహించడం, వైకాపా ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీస్తూ మీడియా ముందుకు రావడం చూశాం. కానీ ఇప్పుడు అది కాస్త రివర్స్ అయి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీదికే మళ్లడం గమనార్హం. అమరావతి పేరుతో అన్ని రకాలుగా మోసగించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలుత బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజధాని రైతులు, దళితులు డిమాండ్‌ చేశారు. రైతులకు సమాధానం చెప్పకుండా రాజధానిలో పర్యటిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉండగా తమను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని స్థానిక రైతులు ప్రశ్నించారు. 

వెలగపూడిలోని సచివాలయం సమీపంలో రాజధాని గ్రామాలకు చెందిన రైతులు మాదల మహేంద్ర, శృంగారపు సందీప్, బెజ్జం రాంబాబు, తుమ్మల రమణారెడ్డి, కొండేపాటి బుజ్జి, బొర్రా శివారెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రకటన సమయంలో టీడీపీ నేతలతో పంట పొలాలు తగులబెట్టించి వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు, పర్మినెంట్‌ భవనాలు ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో దోచుకుని ఇప్పుడు పర్యటనకు సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. 

రైతులను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఈనెల 28న రాజధాని ప్రాంతంలో పర్యటన తలపెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగా తమ అభిప్రాయాలు సేకరించకుండా భూములు తీసుకున్నారని, గ్రామ సభల్లో ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించారని చెప్పారు. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, హామీలను సైతం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన ప్లాటు ఎక్కడుందో కూడా తెలియదని, భూములు తీసుకుని అన్ని రకాలుగా మోసం చేశారని వాపోయారు. 

రాజధాని నిర్మిస్తున్నామంటూ గ్రాఫిక్స్‌ బొమ్మలు చూపించి నాలుగేళ్లు కాలక్షేపం చేసి అన్నీ తాత్కాలిక కట్టడాలే చేపట్టారని విమర్శించారు. టీడీపీ సర్కారు తమను మోసం చేసిందన్నారు. ఉచిత విద్య, వైద్యం అంటూ వంచించారని, ప్లాట్ల పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్, నారాయణ కమీషన్లు కాజేసి తొమ్మిది వేల ఎకరాలను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కారుచౌకగా కొనుగోలు చేశారని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిలో పర్యటిస్తే పసుపు నీళ్లు చల్లించారని, ఇప్పుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాము అలాగే చేయాలా అని ప్రశ్నించారు. 

భూములు తీసుకుని ఒక్క హామీనీ నెరవేర్చలేదంటూ అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు తమకు ఎక్కడ భూములిస్తారో కూడా చెప్పకుండా దగా చేసిన చంద్రబాబు తన నేరానికి క్షమాపణ చెప్పకుండా అమరావతికి వస్తే గుణపాఠం తప్పదని వీరు హెచ్చరించారు.

అయితే ఒక మాట చెప్పుకోవాలి. చంద్రబాబు తమకు ఎన్నో మేళ్లు చేశారని ఆయనతో పోలిస్తే కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ నోట్లో మట్టిగొట్టారని ఇంతవరకు కొందరు అమరావతి రైతుల పేరిట ధ్వజమెత్తడం చూశాం. దానికి భిన్నంగా చంద్రబాబు రాజధాని పేరుతో దోచుకుని తమను నట్టేట ముంచింది కాకుండా తగుదునమ్మా అని తమను పరామర్శించడానికి వస్తున్నాడంటూ తాజాగా కొందరు అమరావతి రైతులుగా చెప్పుకుంటున్నవారు ప్రతిపక్ష నేతపై ధ్వజమెత్తడం వింత గొల్పుతోంది. 

రాజకీయాలకు అతీతంగా తమ సమస్యలను నిజాయితీగా ప్రకటించుకునే అమరావతి రైతులు ముందుకు రావడాన్ని చూడటం నేటి పరిస్థితుల్లో చూడలేమోమో..

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle