newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

చంద్రబాబుని ముప్పుతిప్పులు పెడుతున్న మోడీ

23-06-201923-06-2019 08:16:19 IST
2019-06-23T02:46:19.951Z23-06-2019 2019-06-23T02:44:52.313Z - - 16-12-2019

చంద్రబాబుని ముప్పుతిప్పులు పెడుతున్న మోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు క‌ళ్ల సిద్ధాంతంతో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను శాసించి, ముందు ముందు శాసిస్తాన‌ని భావించిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడికి, మూడో క‌న్ను తెరిచి అస‌లు సిస‌లు రాజ‌కీయ ఏంటో చూపిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అవ‌స‌రానికి జ‌త‌క‌ట్ట‌డం, ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు నెట్ట‌డమే చంద్ర‌బాబు రాజ‌కీయ మార్క్ సిద్ధాంతం. 

1999లో కూడా మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ మీద జ‌నంలో ఉన్న క్రేజ్, త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న చంద్ర‌బాబు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఊపులోనే అప్ప‌ట్లోనే అధికారం నిల‌బెట్టుకున్నారు. ఆ త‌ర్వాత పొత్తులో భాగంగా బీజేపీ నుంచి గెలిచిన ఎంఎల్ఏల‌ను త‌న‌వైపు తిప్పేసుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌తి జిల్లాలో బీజేపీ ఎద‌గ‌కుండా, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధించేశారని అంటారు. 

ఆ దెబ్బ‌తో బీజేపీ ఏపీలో కోలుకోకుండా పోయింది. ఉన్న కొద్ది క్యాడ‌ర్ మొత్తం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చీలిపోయింది. ఇక చంద్ర‌బాబు కూడా, తాను జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోన‌నీ, త‌న‌ను క్ష‌మించాలంటూ జనాన్ని కోరారు. ఈ అనుభ‌వాన్ని, అవ‌మానాన్ని బీజేపీ అధిష్టానం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. ఇక‌ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఢీ కొట్టేందుకు సొంతంగా బ‌లం చాల‌ద‌ని ఊహించిన చంద్ర‌బాబు, న‌రేంద్ర మోడీ వేవ్ బాగా ఉంద‌ని అర్థం చేసుకున్నారు. వెంట‌నే బీజేపీతో పొత్తుకు వెంప‌ర్లాడారు. 

ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీతో కూడా దోస్తీ క‌ట్టారు. అలా 2014 ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు త‌న మార్క్ రాజ‌కీయాన్ని తెర మీద‌కు తెచ్చారు. 2019లో మోడీ హ‌వా ఉండ‌ద‌ని భావించిన ఆయ‌న‌, మ‌హా కూట‌మి పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌తో స‌మావేశాలు జ‌రిపారు. ఇదే స‌మ‌యంలో బీజేపీతో అవ‌స‌రం తీరింద‌ని భావించిన చంద్ర‌బాబు, మోడీ, అమిత్ షాల మీద ఆరోప‌ణ‌లు గుప్పించారు. చిన్న‌గా బీజేపీకి దూరం అయ్యారు. 

ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన‌ తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాన్ని తుంగ‌లో తొక్కారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఇక మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మోడీ నేతృత్వంలో బీజేపీ భారీ మెజార్టీ సాధించ‌డం, చంద్ర‌బాబుకు మింగుడు ప‌డ‌లేదు. దేశ వ్యాప్తంగా మారిన రాజ‌కీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవ‌డంలో విఫ‌లం అయిన చంద్ర‌బాబు, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు రానున్న ఉప‌ద్ర‌వాల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలీక వ‌ణికి పోతున్నారు. 

ఇక త‌మ అధినేత ప‌రిస్థితే ఇలా మార‌డంతో, టీడీపీ నేత‌లు త‌మ‌దారి తాము వెతుక్కుంటున్నారు. అస‌లే సీబీఐ, ఈడీ కేసుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి బీజేపీలో చేరాల‌ని డిసైడ్ అయ్యారు. వీరితో పాటు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల్లో నాలుగు ఆకులు ఎక్కువ చ‌దివిని టీ.జీ. వెంక‌టేష్, గ‌రిక‌పాటి రామ్మోహ‌నరావు కూడా కాషాయ కండువా క‌ప్పుకున్నారు. వీరిని అధికారికంగా త‌మ‌లో క‌లిపేసుకున్న బీజేపీ, రాజ్య‌స‌భ‌ వెబ్ సైటులో టీడీపీ ఇద్ద‌రు ఎంపీలు ఉన్న‌ట్లుగానే మార్చేసింది. రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నంలో బీజేపీ, ఎన్ని నింద‌లు ఎదురైనా ప‌ట్టించుకోలేదు. 

ఆ పార్టీ సంగ‌తి ప‌క్క‌న పెడితే, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఏపీ అసెంబ్లీలో బ‌లం త‌గ్గేలా ఉంద‌ట‌. ఎందుకంటే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంఎల్ఏలు, నేత‌లు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నార‌ట‌. వీరంతా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు నాయ‌క‌త్వంలో పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద తెలుగు త‌మ్ముళ్ల‌కు న‌మ్మ‌కం పోవ‌డం ఖాయం. అంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ కూసాలు క‌దిలిపోవ‌డం ఖాయం. ఈ ఎత్తుగ‌డ‌తోనే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ, ఏపీ రాజ‌కీయాలను ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle