newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

చంద్రబాబుని తెలీని భయం వెంటాడుతోందా?

22-10-201922-10-2019 15:15:52 IST
Updated On 22-10-2019 16:29:23 ISTUpdated On 22-10-20192019-10-22T09:45:52.371Z22-10-2019 2019-10-22T09:42:02.656Z - 2019-10-22T10:59:23.248Z - 22-10-2019

చంద్రబాబుని తెలీని భయం వెంటాడుతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడులో మార్పు వచ్చిందా?

చంద్రబాబులో ఎందుకింత అభద్రత?

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం అవుతుందా? 

టీడీపీ వలసలను ఆయన ఆపలేకపోతున్నారా?

బీజేపీతో పొత్తుకోసం ఆయన తహతహలాడుతున్నారా?

టీడీపీ విలీనం వార్తలు ఆయనను కలవరపరుస్తున్నాయా?

పోలీసులపై కామెంట్లకు కూడా కారణం అదేనా?

అవుననే అంటున్నారు ఆయన్ని గత 10-15 రోజులుగా బాగా దగ్గరుండి పరిశీలిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చంద్రబాబులో అసహనాన్ని పెంచాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ కోసం తాను అహర్నిశలు శ్రమపడితే తనకు దక్కిన ఫలితం ఇదేనా? అంటూ తరచూ ఫలితాలపై ఆయన ఆవేదన చెందడం చూస్తుంటే చంద్రబాబు ఇంకా పరాజయ భారం నుంచి ఇంకా కోలుకోలేదని అర్థం అవుతోంది. 

బీజేపీతో కటీఫ్ చెప్పి తప్పుచేశానని ఆయన ఇప్పుడు ప్రకటించడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో గొడవలు పెట్టుకోవడం, బయటకు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి లాభం జరగలేదు. పైగా, తెలుగుదేశం కోలుకోలేని నష్టం జరిగిందంటూ చంద్రబాబు అంతర్మథనానికి గురవుతున్నారు.

ఎలాగైనా.. బీజేపీతో మళ్లీ కలవడం మంచిదని ఆయన భావిస్తున్నారు. తను చేసే ప్రకటనల వల్ల టీడీపీ కార్యకర్తలు రియలైజ్ అవుతారని, బీజేపీతో కలవడానికి మానసికంగా సిద్ధం అవుతారని భావిస్తున్నారు. ఆయనతో నిత్యం భేటీ అయ్యే టీడీపీ కీలక నేతలు కూడా చంద్రబాబులో ఏదో తెలీని భయం వెంటాడుతోందని చెబుతున్నారు. 

సోమవారం జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ హవా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇది కూడా చంద్రబాబు మైండ్ సెట్ మారడానికి కారణంగా చెబుతున్నారు. బీజేపీ నేతలు తనను, తన పార్టీని ఏదో చేస్తారని బాబు భయపడుతున్నారు. తనకు ఎవరి మీద వ్యక్తిగతమయిన ద్వేషం లేదని చెబుతున్నా బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబుని దరి చేరనివ్వడం లేదు అమిత్ షా, మోడీ. ఓ కీలకవ్యక్తితో రాయబారం పంపినా బీజేపీ సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. అసలు, టీడీపీతో కలిసే ఉద్దేశ్యం బీజేపీకి అసలు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే, బీజేపీ దేశంలో ప్రబలశక్తిగా మారుతోంది. 

2019 ఎన్నికల అనంతరం తాజాగా జరిగిన రెండురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ మెజారిటీ కమలదళానికి లభించనుంది. దీంతో వేరే పార్టీని అక్కునచేర్చుకుని, దాని పాపాలను తనకు రాసుకునే పని బీజేపీ నేతలు చేయకపోవచ్చు. దరిదాపుల్లో ఎన్నికలు కూడా లేవు. దీంతో బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టనుంది. ఏపీలో బీజేపీని పటిష్టం చేసేందుకు టీడీపీ కీలక నేతలను గాలంపట్టి లాగేసే అవకాశాలున్నాయి. కొందరు టీడీపీ నేతలకు వైసీపీ వైపు దారులు మూసుకుపోయి ఉన్నాయి.

దీంతో విధిలేని పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే. దీంతో బీజేపీ నేతలతో రాయబారాలు నడిపి ఆపార్టీలో చేరేందుకు స్కెచ్ లు వేస్తున్నారు టీడీపీ కీలక నేతలు. ఇది కూడా చంద్రబాబు భయానికి కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా చంద్రబాబు ఎవరినీ అంతగా నమ్మరు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నా.. పార్టీలో మిగిలింది ఎవరో ఆయనకే తెలీడం లేదు. పార్టీ విలీనం అనే బూచి చంద్రబాబుని భయపెడుతుందనేది నిర్వివాదాంశం. 2020లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle