newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

చంద్రబాబుతో పొత్తు కల.. తలుపులు మూసేశాం.. కన్నా

17-10-201917-10-2019 11:27:07 IST
Updated On 17-10-2019 16:38:55 ISTUpdated On 17-10-20192019-10-17T05:57:07.783Z17-10-2019 2019-10-17T05:57:05.170Z - 2019-10-17T11:08:55.215Z - 17-10-2019

చంద్రబాబుతో పొత్తు కల.. తలుపులు మూసేశాం.. కన్నా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ టీడీపీతో పొత్తు ఇక ఉండబోదని, తమవైపు నుంచి బాబుకు తలుపులు మూసివేశామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. ఈ అంశంపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ వైఖరిని స్పష్టంగా ఇంతకుముంచే చెప్పేశారని. దాంట్లో మార్పు లేదని కన్నా అభిప్రాయపడ్డారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తుకు 2018 ప్రారంభంలో  గండిపడ్డ తర్వాత టీడీపీనే దెబ్బతిందని కన్నా వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ, ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్‌తో కలిసి గాంధీ సంకల్ప యాత్రను బుధవారం ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న వైకాపాకు తామే ప్రత్యామ్నాయంగా సొంతంగా ఎదుగుతామని చెప్పారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడే బీజేపీతో తొలిసారిగా పొత్తు కుదుర్చుకున్నారని, అదేవిధంగా నరేంద్ర మోదీ జనరంజక ఆకర్షణను గమనించి చంద్రబాబు 2014లో నరేంద్రమోదీతో తనకు తానుగా పొత్తు పెట్టుకున్నాడని కన్నా చెప్పారు. 

నిశితంగా గమనించినట్లయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడకుండా ఆపాలన్నదే చంద్రబాబు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పుడు మేము ఏపీలో బలం పంజుకుంటున్నందున చంద్రబాబు మళ్లీ మాతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పశ్చాత్తాప ప్రకటన చేశారని కన్నా ఎద్దేవా చేశారు. 

ప్రత్యేక హోదా, తదితర అనేక అంశాలలో కేంద్రం సహకరించకపోవడం వల్లే తాము బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో తాను ఘర్షణ పడితే అది తెలుగుదేశంకు ఇటీవలి ఎన్నికల్లో నష్టం కలిగించిందని చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో వాపోయారు.

కేంద్రంతో అలాంటి విభేదాలకు దిగకపోయి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో ఈ ఏప్రిల్లో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా భవిష్యత్తులో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తిరిగి ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుండవచ్చు కానీ ఆయనకు తలుపులు శాశ్వతంగా మూసివేశామని షా తేల్చి చెప్పారు. 

ఏపీలో ఎలాంటి ప్రాజెక్టునైనా సరే పూర్తి చేసే నిజాయితీ చంద్రబాబుకు లేదని కూడా అమిత్ షా అప్పట్లో విమర్శించడం తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle