newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

చంద్రబాబుకు షాకిచ్చిన గంటా..! జగన్‌ నిర్ణయానికి జై!!

18-12-201918-12-2019 09:53:07 IST
Updated On 18-12-2019 10:25:38 ISTUpdated On 18-12-20192019-12-18T04:23:07.550Z18-12-2019 2019-12-18T04:23:05.131Z - 2019-12-18T04:55:38.183Z - 18-12-2019

చంద్రబాబుకు షాకిచ్చిన గంటా..!  జగన్‌ నిర్ణయానికి జై!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ జగన్‌ ప్రకటించడంతో అయోమయం నెలకొంది. పలువురు జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్‌ ప్రకటనపై టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు మాత్రం టీడీపీకి షాకిస్తూ.. జగన్మోహన్‌ నిర్ణయం కరెక్ట్‌ అంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి గంటా వైసీపీ చేరుతారనే చర్చతెరపైకి వచ్చింది.

విశాఖపట్టణంను పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. రోడ్‌, రైల్‌, ఎయిర్‌, వాటర్‌ కనెక్టివిటీతో రాజధానిగా అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని, అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారని గంటా పేర్కొన్నారు.

గంటా శ్రీనివాసరావు తీరును పలువురు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. గంటా వ్యవహారశైలి ఇప్పటికే టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన టీడీపీకి గుడ్‌ బై చెప్పి.. వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గంటా తెలుగుదేశంపార్టీతో అంటీముంటనట్లుగా ఉంటున్నారని, త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని విషయంలో సీఎం జగన్‌ చేసిన ప్రకటనను ఆయన సమర్థించడం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇప్పటికే గంటా శ్రీనివాస్‌రావు పార్టీ మారుతున్న వ్యక్తిగానే టీడీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఆయన వ్యవహార శైలికూడా మొదటి నుంచి అంతే ఉండటంతో టీడీపీ అధిష్టానంసైతం పెద్దగా గంటాను పట్టించుకోవటం లేదు. అసెంబ్లీ సమావేశాలకు గంటా హాజరు కాలేదు. చివరి రెండురోజుల ముందు అసెంబ్లీకి వచ్చిన గంటా చంద్రబాబు చాంబర్‌లోనే ఉండిపోయారు. కానీ ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో మళ్లీ గంటా అసెంబ్లీకి వచ్చి తెల్లారినుంచి గైర్హాజరయ్యారు.

మరోవైపు గంటా తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గంటా పార్టీ మారితే టీడీపీకి వచ్చే నష్టం ఏమీలేదని, కానీ టీడీపీలో ఉండి పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు సరికాదంటూ ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీని వీడారని, గంటా వెళ్లినంత మాత్రాన టీడీపీకి వచ్చే నష్టం ఏమీలేదని, ఆయన పార్టీ మారిన తరువాత టీడీపీకి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే బాగుంటుందని పలువురు టీడీపీ నేతలు పేర్కొనటం గమనార్హం.

మరోవైపు గంటా శ్రీనివాస్‌రావు వర్గీయులు మాత్రం టీడీపీని వీడే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. విశాఖపట్టణంను పరిపాలన రాజధానిగా చేస్తామని అనడంతోనే ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా గంటా మాట్లాడారని, అంతేకానీ పార్టీని వీడే అంశంపై గంటా ఆలోచన చేయడం లేదని ఆయన వర్గీయులు పేర్కొంటుండటం కొసమెరుపు. మరి గంటా దారి ఎటు వైపో తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.  

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   18 minutes ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   an hour ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   an hour ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   an hour ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   3 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   3 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   3 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   3 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   3 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   5 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle