newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

చంద్రబాబుకు ‘లక్ష్మీ’స్ చికాకు!

22-02-201922-02-2019 17:07:42 IST
2019-02-22T11:37:42.310Z22-02-2019 2019-02-22T11:37:40.500Z - - 25-02-2020

చంద్రబాబుకు ‘లక్ష్మీ’స్ చికాకు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మీద చంద్రబాబు ఇండైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చూస్తే ఈ సినిమా వ్యవహారం ఆయన్ని ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ‘‘కొత్త తరానికి పాత ఎన్టీఆర్ వ్యవహారాలు పెద్దగా తెలియవని... మనం సరిగ్గా చెప్పకపోతే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది’’. ఇదీ బాబు భావన! ఎన్టీఆర్ సినిమా ద్వితీయ భాగంలో ఎక్కడా వైస్రాయ్ ఉదంతాన్ని ప్రస్తావించలేదు. పైగా దాదాపు అదే ఇతివృత్తంతో వస్తున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమాలో తాను ‘‘హైజాక్’’ చేసుకున్న తెలుగుదేశం పార్టీ గురించి లెఫ్ట్ అండ్ రైట్ ఏకిపారేశారన్నది నిజం! తన క్యారెక్టర్‌ని ఆ సినిమాలో చెడ్డగా చూపించారన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్తుందన్న చికాకు బాబులో ఉన్నట్లు కనిపిస్తోంది.

చరిత్రలో ఏమి జరిగిందన్నది పక్కనపెడితే... అసలు చంద్రబాబు ఆరోజుల్లో తన మామగారు కమ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పట్ల ఎలా వ్యవహరించారు? దాంతోపాటు తాను ఎన్టీఆర్‌ను పక్కకు పెట్టి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? అన్న విషయాలతో బాటు తాను సిఎం అయిన ఐదు నెలల్లోపే ఎన్టీఆర్ మరణించడం వంటి అనేక విషయాలు ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’’ అనే రెండో భాగంలో ఎక్కడా ఊసులో కూడా లేకపోవడంతో... ఈ ఆర్జీవీ కొత్త చిత్రం ఆ విషయాలపైనే తన దృష్టిని కేంద్రీకరించడం ఇబ్బందికరమైన విషయం!

ఒక రకంగా ఎన్టీఆర్ రెండో భాగం ఆ విషయాల్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని సంతోషపరిచినప్పటికీ, ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని, పరిణామాల్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ద్వారా ఏదో ఒక రకంగా బయటపడడం ఇబ్బందికరమైన విషయం! మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే తీసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఆర్జీవీ కొత్త సినిమా జనాల్లోకి వెళ్తుందా? అన్నది అసలు ప్రశ్న!      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle