newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చంద్రబాబుకు మరో బాబు షాక్

09-03-201909-03-2019 15:24:38 IST
2019-03-09T09:54:38.640Z09-03-2019 2019-03-09T09:43:31.724Z - - 22-09-2019

చంద్రబాబుకు మరో బాబు షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోక్ సభ సీటు నుంచి తాను పోటీ చేయనని సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బలమైన నేతగా పేరున్న మాగంటి బాబు నిర్ణయం ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందట. ముఖ్యంగా జనంలో టీడీపీ విశ్వసనీయత కోల్పోయిందన్న మాగంటి డైలాగ్ చంద్రబాబుకు మింగుడు పడటం లేదని స్వయానా టీడీపీ నేతలే చెబుతున్నారు.

అంతేకాదు... ఏలూరు లోక్ సభ సీటులో టీడీపీ బాగా వీక్ అయిందన్నది మాగంటి బాబు ఫీలింగ్. అందుకే పోటీ చేసి, డబ్బు ఖర్చు పెట్టి ఓడిపోవడం ఆయనకు ఇష్టం లేదని మాగంటి బాబు అనుచరులు చెబుతున్నారు. అయితే ఇదంతా పైకి చెప్పే మాటలే అయినా... అసలు విషయం వేరే ఉందనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట. ఏలూరు ఎంపీ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్‌ను బరిలో దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇదే సమయంలో మాగంటి బాబును కైకలూరు అసెంబ్లీ నుంచి పోటీలో పెట్టాలని ఆలోచించిన చంద్రబాబు, ఈ విషయాన్ని మాగంటి బాబుతో చెప్పారు.

ఇదే మాగంటికి కోపం తెప్పించిందంటున్నారు. తాను కైకలూరు నుంచి పోటీ చేస్తే జగన్ హవా ముందు ఓడిపోతానన్న భయం మాగంటి బాబుకు పట్టుకుంది. ఎంపీగా పోటీ చేసే టీడీపీ అభ్యర్థి తనకు ఏ మేరకు మద్దతు ఇస్తారో అన్నది కూడా ఆయన అనుమానిస్తున్నారు. అందుకే తనకు ఏలూరు లోక్ సభ సీటు ఇవ్వాలని కోరారట.

అయితే దానికి చంద్రబాబు ఒప్పుకోలేదనీ, కైకలూరు నుంచే బరిలో దిగాలని చెప్పడంతో... దిగాలు పడ్డ మాగంటి బాబు... కైకలూరు నుంచి పోటీ చేస్తానో, లేదో చెప్పకుండా... ఏలూరు సీటు నుంచి తాను పోటీ చేయనని చెబుతున్నారు. అంటే, ఏలూరు ఎంపీ సీటుకు ఎవరు పోటీ చేసినా, తన మద్దతు ఉండదంటూ మాగంటి బాబు చెప్పకనే చెబుతున్నారని అర్థం చేసుకోవాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle