newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

చంద్రబాబుకు ‘ఏలేరు’ చిక్కులు

10-01-201910-01-2019 17:34:53 IST
2019-01-10T12:04:53.772Z10-01-2019 2019-01-10T11:41:27.662Z - - 17-07-2019

చంద్రబాబుకు ‘ఏలేరు’ చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏలేరు కుంభకోణం వదిలేలా లేదు.  ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలుగుదేశం వర్గాలను కలవరపెడుతోంది. 1996లో అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఏపీ సీఐడీని ఆదేశించింది. దర్యాప్తు వెంటనే పూర్తి చేసి ఏమాత్రం జాప్యం లేకుండా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసే అధికారం ఏ న్యాయాధికారికి ఉందన్న దానిపై పదేళ్లుగా సాగుతున్న సాంకేతిక ఇబ్బందిని కూడా హైకోర్టు తొలగించింది.

ఏలేరు కుంభకోణానికి బాధ్యులైన వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని విశాఖ జిల్లా అనకాపల్లి, చోడవరంలోని సీనియర్‌ సివిల్ జడ్జిలకు ఉందని హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో మళ్ళీ ఈ కేసు తెరమీదకు వచ్చింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయదలుచుకుంటే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకోవాలని పేర్కొంది. హైకోర్ట్ తాజా తీర్పు చంద్రబాబునాయుడికి టెన్షన్ తెప్పించడం ఖాయం అనే భావన వ్యక్తం అవుతోంది. ఇంతవరకు తనపై ఎన్ని కేసులు నమోదైనా.. కోర్టులో పిటీషన్లు వేసినా వాటిని తనదైన శైలిలో మేనేజ్ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకునేవారు బాబు. తొలిసారి హైకోర్టు ఇచ్చిన ఝలక్‌తో చంద్రబాబునాయుడు టెన్షన్ పడుతున్నారు.

ఏలేరు భూములకు ధర పెంచి అక్రమంగా నష్టపరిహారం పెంచి కోట్లు కొల్లగొట్టారని 1996లోనే అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  అప్పట్లో  చంద్రబాబు సంతకాలు చేసి నిధుల దుర్వినియోగం చేశారని.. రైతులకు ఎగ్గొట్టారని.. తక్కువ చెల్లించి దోచుకున్నారని కోర్టుల్లో పిటీషన్లు పడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలేరు కుంభకోణం గుట్టరట్టయ్యే అవకాశం కలిగింది. అయితే చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉండే సీఐడీ ఏమేరకు బాబుపై విచారణ జరిపి ఛార్జిషీట్ దాఖలుచేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా ఈకుంభకోణంలో తమకు న్యాయం జరుగుతుందేమోనని బాధితులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల వేళ ఏం జరుగుతుందోనని పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle