newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

చంద్రబాబుకి షాక్.. జగన్‌తో ఎమ్మెల్యే గిరి భేటీ

31-12-201931-12-2019 07:33:40 IST
Updated On 31-12-2019 10:07:47 ISTUpdated On 31-12-20192019-12-31T02:03:40.214Z31-12-2019 2019-12-31T02:02:06.179Z - 2019-12-31T04:37:47.704Z - 31-12-2019

చంద్రబాబుకి షాక్.. జగన్‌తో ఎమ్మెల్యే గిరి భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దెబ్బకు టీడీపీకి మైండ్ బ్లాంక్ అయింది. రాజీనామా చేశానని చెబుతున్నా.. చేయకుండానే తటస్థ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ అధినేత, సీఎం జగన్ ని కలవడం టీడీపీ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మద్దాలి గిరిని జగన్‌ వద్దకు తీసుకెళ్లారు. త్వరలో మద్దాలి గిరి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అంటున్నారు.

చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలనీ, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మద్దాలి గిరి చేస్తున్న కామెంట్లు.. టీడీపీలో కలకలం రేపాయి. జగన్ తో నియోజకవర్గ అభివృద్ది గురించి మాట్లాడడానికే భేటీ అయ్యానని, వివిధ పెండింగ్ నిధులు విడుదల గురించి జగన్ హామీ ఇచ్చారన్నారు. అయితే తాను మారడం లేదన్నారు. 

పార్టీలో చేరికకు సీఎం అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతకొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం పట్ల ఎమ్మెల్యే గిరి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండు నెలల కిందటే ఆయన వైసీపీలో చేరతారని అంతా భావించారు కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడంతో పార్టీ మార్పుపై స్పష్టత వచ్చినట్టేనని అంటున్నారు. టీడీపీ కీలకనేత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. త్వరలో గంటా శ్రీనివాసరావు ఆయన తోపాటు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి.

విశాఖ పాలనా రాజధాని అంటూ జగన్ చేసిన ప్రకటనకు గంటా వంత పాడారు. వైసీపీ చేరేందుకు గంటా శ్రీనివాసరావు సరైన సమయం కోసం చూస్తున్నారు.. గొట్టిపాటి రవి అయితే ఇప్పటికే వైసీపీ కీలకనేతలు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

జగన్ షరతులకు కూడా గొట్టిపాటి అంగీకరిస్తున్నారనే ప్రచారం వుంది. వైసీపీలో చేరేందకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని గొట్టిపాటి రెడీ అంటున్నారు.

అలాగే నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్యతో కూడా గొట్టిపాటి టచ్ లో వున్నాడు. వంశీ బాటలోనే గంటా, గొట్టిపాటి... ఇలా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతోంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇది మింగుడుపడని విషయమే. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   40 minutes ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   3 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle