newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

చంద్రబాబుకి షాక్.. ఓటుకు నోటు కేసుపై ఆర్కె పిటిషన్

25-11-201925-11-2019 18:39:46 IST
2019-11-25T13:09:46.107Z25-11-2019 2019-11-25T13:09:42.072Z - - 04-08-2020

చంద్రబాబుకి షాక్.. ఓటుకు నోటు కేసుపై ఆర్కె పిటిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి చిక్కులు తప్పేలా లేవు. ఒక వైపు అక్రమాస్తుల కేసులో ఏసీబీ కోర్టు తాజా ఆదేశాలు ..మరోవైపు ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే ఆర్కె పిటిషన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత కొద్దికాలంగా ఓటుకు నోటు కేసులో స్తబ్దత ఏర్పడింది. తాజాగా మళ్ళీ ఈ కేసు తెరమీదకు వచ్చింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్ట్ తలుపు తట్టారు. 

ఎర్లీ హియరింగ్‌ కోసం ఆర్కేపిటిషన్‌ దాఖలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు 2015లో తెలంగాణలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారు. ఈ క్రమంలో అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేశాయి. రేవంత్‌రెడ్డి కొన్నాళ్ళపాటు జైలులో గడిపారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో పోటీచేసి కొడంగల్ నుంచి ఓడిపోయారు.

తర్వాత జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి.  స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కూడా చంద్రబాబు ఆడియో బయటకు వచ్చింది. చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆర్కె పిటిషన్ తో మళ్లీ కేసు తెరమీదకు వచ్చింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle