చంద్రబాబుకి షాకేనా? ఇద్దరు విశాఖ ఎమ్మెల్యేలు జంపేనా?
02-11-201902-11-2019 14:39:39 IST
Updated On 02-11-2019 17:02:59 ISTUpdated On 02-11-20192019-11-02T09:09:39.475Z02-11-2019 2019-11-02T09:09:36.662Z - 2019-11-02T11:32:59.031Z - 02-11-2019

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను తట్టుకుని కాస్తో.. కూస్తో తెలుగుదేశం నిలబడిన జిల్లాల్లో విశాఖ ఒకటి. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమలో ఘనబాబు, విశాఖ ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధిచారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తరం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన గంటా శ్రీనివాసరావు అతి త్వరలో పార్టీ మారడం ఖాయమని అతని అనుచరులు బల్దగుద్ది మరీ చెబుతున్నారు. ఈ విషయంపై ఏపీ వ్యాప్తంగా చర్చలు జరుగుతుండగానే విశాఖ పొటిలికల్ ప్రకంపనలు గన్నవరంకు పాకాయి. అక్కడ కూడా పొలిటికల్ టెర్రర్ మొదలైంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా గంటా శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ ఎపిసోడ్‌పై పొలిటికల్ స్క్రీన్‌పై తీవ్ర స్థాయి చర్చ కొనసాగుతుండగా విశాఖ టీడీపీలో మరో ఇద్దరు జంప్ అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వైసీపీకి వెళ్లాలా..? లేదా బీజేపీకి వెళ్లాలా..? అన్నదానిపై గంటా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీలోకి వెళితే రాజీనామా చేయాలి. అటు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందో లేదో అనుమానం. దీంతో గంటా శ్రీనివాసరావు బీజేపీ నేతల టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కీలక నేత రామ్ మాధవ్‌తో ఇప్పటికే మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే గంటా పార్టీ మారడం ఖాయం. ఒకటి రెండు రోజులు లేటవుతుంది. కానీ కండువా మార్పిడి జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. దక్షణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సైతం పక్కచూపులు చూస్తున్నారట. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్‌కు, ఆయనకు అస్సలు పొసగడం లేదట. దీంతో ఆయన అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం లేదట. దీంతో వాసుపల్లి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు టీడీపీలో ఉన్నారు. కానీ, మునుపటి స్పీడ్‌లో లేరు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ చంద్రబాబుతో ఉన్న అనుబంధంతో పార్టీని వీడే పరిస్థితి లేదు. పార్టీలో ఇతర ఎమ్మెల్యేలు సైలెంట్ కావడంతో ఇప్పుడు సిటీలో వెలగపూడి లీడ్ తీసుకుటున్నారు. గతంకంటే మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. మత్తానికి విశాఖలో ఆ ఇద్దరు పార్టీ మారడ ఖాయమని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారారానికి వారు ఫుల్స్టాప్ పెడతారా..? లేదా..? అన్నది చూడాలి.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
9 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్‌పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్‌లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా