చంద్రబాబుకి జగన్ పంచ్.. అక్టోబర్ నుంచి రైతు భరోసా
06-06-201906-06-2019 14:56:05 IST
Updated On 24-06-2019 15:57:42 ISTUpdated On 24-06-20192019-06-06T09:26:05.150Z06-06-2019 2019-06-06T09:25:59.337Z - 2019-06-24T10:27:42.713Z - 24-06-2019

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ శాఖల రివ్యూల సందర్భంగా తమ హామీలను అమలుచేసే పనిలో పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు సర్కార్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను రద్దుచేస్తున్నారు. నవరత్నాల పేరుతో జనాలకు దగ్గరయిన జగన్.. ఆదిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దుచేస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు పథకాన్ని రద్దుచేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చలామణి కావడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలను మార్కెట్లో చలామణి చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని, రైతుల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిని అవసరమైతే జైలుకు పంపుతామని జగన్ హెచ్చరించారు. ఈ విషయమై అసెంబ్లీలో కొత్త విత్తన చట్టాన్ని తీసుకువస్తామని జగన్ చెప్పారు. అక్టోబర్ రెండో తేదీ నుండి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ద్వారా రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలను వ్యవసాయానికి కేంద్రంగా మార్చాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా వ్యవసాయంపై రైతులకు భరోసా కల్పించినట్టు అవుతుందన్నారు. ఈ విషయంలో అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని జగన్ సూచించారు. మంచి సూచనలు చేసిన అధికారులను సన్మానం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ, 12,500లను రైతు భరోసా కింద అందించనున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ధరల హెచ్చుతగ్గుల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని, రైతులను ఆదుకునేందుకు వీలుగా ధరల స్థీరీకరణ నిధి కోసం బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం ఎకరానికి రూ. 4వేలు అందించింది. తర్వాత ఆ మొత్తాన్ని రూ.5వేలకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఎన్నికలకు ముందు రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి భారాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నారు.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా