newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

చంద్రబాబుకి చెప్పి జగన్ చేసిందేంటి?

11-06-201911-06-2019 15:03:35 IST
Updated On 24-06-2019 12:16:24 ISTUpdated On 24-06-20192019-06-11T09:33:35.809Z11-06-2019 2019-06-11T09:30:59.867Z - 2019-06-24T06:46:24.032Z - 24-06-2019

చంద్రబాబుకి చెప్పి జగన్ చేసిందేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వంగి దండాలు పెట్టే సంస్కృ‌తిపై విపరీతమయిన చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో మోడీ దగ్గర వ్యవహరించిన తీరు పలువురికి ఆశ్చర్యం, విస్మయాన్ని కలిగించిందనే చెప్పాలి. రెండురోజుల క్రితం రెండోసారి ప్రధాని హోదాలో నరేంద్రమోడీ తిరుపతికి వచ్చిన సంగతి తెలిసిందే.

Image may contain: one or more people

ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సందర్భంగా ప్రధానికి పాదాభివందనం చేయబోయారు జగన్. విమానం నుంచి కిందకి దిగి వస్తున్న మోడీకి జగన్ గులాబీతో స్వాగతం పలికారు. 

ప్రధానిని చూడగానే సీఎం జగన్మోహన్ రెడ్డి నడుం వంచేశారు. ఒకసారి కాదు రెండు సార్లు ప్రధాని మోడీ కాళ్లు మొక్కేందుకు జగన్ ప్రయత్నించగా.. ప్రధాని వద్దని వారించారు. ఒడుపుగా జగన్ ని ఆపేశారు మోడీ. అనంతరం జగన్‌తో ఏదో మాట్లాడి భుజం తట్టారు. అప్పటికి జగన్ వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారం మీడియాలో ప్రధానంగా చర్చకు వచ్చింది.

మోడీ ముందు జగన్ వంగి వంగి దండాలు పెట్టాల్సినంత అగత్యం, అవసరం ఏమొచ్చిందని పలువురు చర్చించుకోవడం వినిపించింది. జగన్ ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు, ఆంధ్రుల ప్రతినిధి, సీఎం హోదాలో ఆయన ఆ పనిచేసి ఉండకూడదంటున్నారు. 

Image result for chandrababu bends modi

గతంలో విపక్షనేతగా, ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు-మోడీ ముందు వంగి వంగి దండాలు పెట్టడం ఏంటని తీవ్రంగా విమర్శించిన ఉదంతాలను జనం గుర్తుచేసుకుంటున్నారు.  నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళితే.. ప్రధాని నరేంద్ర మోడీని కడిగేస్తారని.. అడిగేస్తారని.. యుద్ధం ప్రకటిస్తారంటూ మీడియా కథనాలు రాసిందని జగన్ అన్నారు.

అయితే, చంద్రబాబువన్నీ ఉత్తరకుమారుడి ప్రగల్భాలేనని తేలిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ఇవ్వకున్నా చంద్రబాబు ఆయన ఎడమచేయిని పట్టుకున్నారని జగన్ విమర్శలు చేశారు. అంతేకాదు మోడీని సర్ సర్ అంటూ పదేపదే సాగిలపడ్డారు చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ నేత చేసిందానికి ఏం బదులిస్తారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. 

అదంతా ఓకే.. మరి ఇప్పుడు జగన్ ఏం చేశారు? 22 మంది ఎంపీలు ఉన్న జగన్ మోడీ ముందు మోకరిల్లడం ఏంటి? హోదా ఇస్తానని మోడీ చెప్నారా? కనీసం మోడీ తెలుగువారికి ఏం వరాలిచ్చారు? ఒకవేళ వరాలచ్చినా అంత స్థాయిని దిగజార్చుకోవాలా? సగటు తెలుగువాడి మదిలో మెదులుతున్న సందేహాలివే. మాట తప్పను, మడమ తిప్పను అన్న కడప పౌరుషం ఏమయిందంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

పోనీ ఏపీ కోసం మోడీ ఏదైనా భారీ హామీ ఇచ్చినా అంతగా దండాలు పెట్టాల్పింది కాదు.  కానీ వంగి వంగి దండాలు పెట్టాల్సినంత గొప్పపని మోడీ ఏం చేశారని అంటున్నారు. మోడీ ముందు జగన్ వ్యవహరించిన తీరుని జనం మెచ్చడంలేదు. తెలుగువారి ఆత్మగౌరవం మోడీ ముందు పడేశారని, అంతలా పడిపోవడం ఏంటని జనం అంటున్నారు. 

అంతేకాదు పక్కనున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మోడీ విషయంలో వ్యవహరించిన తీరుని గుర్తుచేసుకుంటున్నారు. మోడీ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో భేటీ అయ్యారు. మోడీ వెళ్లేటప్పుడు కూడా ఆమె కారు దాకా కూడా రాలేదు.

Image result for jayalalitha not bend modi

ఇంటి గుమ్మం వరకే వచ్చి జయలలిత తన దర్పం చాటారు. ఇక ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం తన హుందాతనం చాటారు. మోడీ ముందు మేరుశిఖరంలా ఆయన నిలబడ్డ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒడిశాలో ఆయన తిరుగులేని నేత. కేంద్రం ముందు ఎప్పుడూ ఆయన సాగిలపడలేదు. ఈ మాత్రం తెగువ, ఆత్మగౌరవం, దర్పం తెలుగు ముఖ్యమంత్రులకు ఎందుకు కొరవడింది. 

Image may contain: 2 people, people standing and indoor

ఆత్మగౌర‌వం విష‌యంలో ఏకంగా పార్టీనే పెట్టిన తెలుగు వారు.. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో సాగిల‌ప‌డ‌డం ఎంత‌మేర‌కు స‌మంజ‌స‌మ‌ని అప్పట్లో చంద్రబాబుపై విమర్శలు వచ్చాయి. ఏపీకి నిధులు రావాలి, నీళ్లు రావాలి. విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం అన్నీ జ‌ర‌గాలి. ఈ విష‌యంలో కేంద్రాన్ని అడ‌గ‌డం త‌ప్పుకాదు. కానీ దేబిరించడం, సాగిలపడడం ఏంటని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనం ప్రశ్నిస్తున్నారు. 

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   6 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   7 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   7 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   12 hours ago


హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   13 hours ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   14 hours ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   14 hours ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   14 hours ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   15 hours ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle