newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

చంద్రబాబుకి చుక్కెదురు.. ఆస్తుల కేసులో స్టే ఎత్తివేత

26-04-201926-04-2019 22:51:45 IST
Updated On 04-07-2019 11:49:49 ISTUpdated On 04-07-20192019-04-26T17:21:45.268Z26-04-2019 2019-04-26T17:21:42.321Z - 2019-07-04T06:19:49.130Z - 04-07-2019

చంద్రబాబుకి చుక్కెదురు.. ఆస్తుల కేసులో స్టే ఎత్తివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చంద్రబాబుకి చుక్కెదురైంది. ఎన్నికల ఫలితాల సంగతి ఎలా వున్నా ఆయన స్టేలు తెచ్చుకున్న కేసు ఒకటి మళ్లీ తెరమీదకు వచ్చింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు షాక్ తగిలింది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. 2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ పిటిషన్‌పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. 

కాగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయింది. దీంతో హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇది చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle