newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

చంద్రబాబుకి చింతమనేని గుదిబండ కానున్నారా?

24-02-201924-02-2019 06:12:13 IST
2019-02-24T00:42:13.858Z23-02-2019 2019-02-23T16:17:23.118Z - - 24-05-2019

చంద్రబాబుకి చింతమనేని గుదిబండ కానున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలు సృష్టించకపోతే ఆశ్ఛర్యపోవాలి. నియోజకవర్గంలో అందరితోనూ దురుసుగా దూకుడుగా ఉండడం ఆయనకు అలవాటు. అలాగే ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన మాటతీరూ, వ్యవహార శైలీ ఇంచుమించు అలవాటుఅయిపోయాయి.

ప్రభుత్వ ఉద్యోగుల మీద నోరేసుకుని పడడం, పోలీసులమీద తిట్ల దండకాన్ని ఎత్తుకోవడం, చిన్నచితకా కార్యకర్తలమీద చెయ్యచేసుకోవడం చింతమనేనికి అలవాటే. నియోజకవర్గంలో జనం కూడా ప్రభాకర్ నుంచి మరోరకమైన ప్రవర్తనను ఆశించేవారు కాదు. 

మనిషి దురుసుగా ఉన్నా చెడ్డవాడు కాదులే అని సరిపెట్టుకుంటూ వస్తున్నారు. గత టెర్మ్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే తీరు ఆయనది. అయినా మొన్న 2014 ఎన్నికల్లో దెందుకూరు నుంచి మళ్ళీ గెలవగలిగాడు.

అయితే దళితుల్ని కులం పేరుతో ‘మీకు రాజకీయాలెందుకు రా’ అన్నారన్న వార్త, ఆ తాజా సంఘటన మాత్రం ఇన్నాళ్ళూ సరిపెట్టుకున్నవాళ్ళకు కూడా మింగుడు పడ్డం లేదు. కులం పేరెత్తి ఇటీవల ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావాలనుకున్నవారు ఈ సంఘటన ప్రభావం కేవలం దెందులూరుమీదే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 

నియోజకవర్గానికి మాత్రమే చింతమనేని దుడుకు ప్రవర్తన ప్రభావం పరిమితంకాదని వారి భయం. అసలే దళితులు తెలుగుదేశం పట్ల అంత అనుకూలంగా ఉండరు. ఇపుడు ఈ తాజా ఘటనతో తెలుగుదేశం పార్టీ మరింత నష్టపోవచ్చని జిల్లా ‘దేశం’ వర్గాలు గుబులుగా ఉన్నాయి. 

గతంలో ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని పై దూకుడుగా ప్రవర్తించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగచేసుకుని అది రాధ్ధాంతం కాకుండా చూసారు. ఎన్జీవో నాయకులు కూడా ఆరోజు సీఎం కు సహకరించారు. ఇక స్థానికంగా ఏవైనా గొడవలు జరిగినా అవి అక్కడికక్కడే సర్దుమణిగేవి. కాని ఇప్పటి విషయం కొంచం క్లిష్టమైనది. దళితులతో ముడిపడి ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగింది. సర్దుకోవడానికి కూడా ఎక్కువ సమయం లేదు.

అసలు ముందునుంచే చంద్రబాబు చింతమనేనిని మందలించి అదుపుచేసి ఉన్నట్టయితే ఈ విషయం జరిగి ఉండేది కాదని, ఎమ్మెల్యే తన తీరు ఎప్పుడో మార్చుకుని ఉండేవారనీ స్థానికులు అనుకుంటున్నారు. 

ఈ పరిస్థితుల్లో చింతమనేని తెలుగుదేశానికి భారంగా మారనున్నాడా అని పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగానే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పదిహేనుకు పదిహేను స్థానాలు ఇచ్చిన పశ్చిమ గోదవరి జిల్లా లో ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద గండే పడుతుందన్న మాట వినపడుతోంది. అదే నిజమయితే ఆ గండి మొట్ట మొదట పడేది దెందులూరులోనే అని  తెదేపా వర్గాలు తలపట్టుకుంటున్నాయి.   

 


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle