newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చంద్రబాబుకి కాపు నేత‌ల టెన్ష‌న్..!

02-07-201902-07-2019 08:12:15 IST
Updated On 03-07-2019 12:09:31 ISTUpdated On 03-07-20192019-07-02T02:42:15.075Z02-07-2019 2019-07-02T02:31:19.893Z - 2019-07-03T06:39:31.872Z - 03-07-2019

చంద్రబాబుకి కాపు నేత‌ల టెన్ష‌న్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడును కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు తెగ టెన్ష‌న్ పెడుతున్నారు. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు, ప‌లువురు నేత‌లు పార్టీని వీడిన స‌మ‌యంలో కాపు నేత‌లంతా ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హిస్తుండ‌టం టీడీపీలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంది.

వీరిలో కొంద‌రు పార్టీ ప‌ట్ల బాహాటంగానే అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుండ‌టం, వీరిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతుండ‌టం టీడీపీ నేత‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నలుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీ మారిన రోజే కాకినాడ‌లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వ‌ర్యంలో కాపు నేత‌లంతా స‌మావేశ‌మ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. కాపు సామాజిక‌వ‌ర్గం అభ్య‌ర్థుల‌కు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ చిన్న‌చూపు చూసింద‌ని, ఆర్థికంగా స‌హ‌క‌రించేలేద‌నేది వీరి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇక‌, యువ‌నేత నారా లోకేశ్ వైఖ‌రి ప‌ట్ల కూడా వీరిలో కొంత అసంతృప్తి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ త‌ర్వాత కూడా ఒక‌సారి స‌మావేశ‌మైన కాపు నేత‌లు అధినేత చంద్రబాబు నాయుడును క‌లిసి త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. వీరిని ఎట్టి ప‌రిస్థితుల్లో చేజార‌కుండా చూసుకునేందుకు చంద్ర‌బాబు బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నించారు.

అయితే, కొంద‌రు నేత‌లు భ‌విష్య‌త్‌పై బెంగ‌తో పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోలేక‌పోతున్నారు. త‌మ సామాజ‌క‌వ‌ర్గం ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టీడీపీకి దూర‌మైన‌ట్లు వీరి అంచ‌నా వేస్తున్నారు. టీడీపీలో ఉంటే రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్ప‌ని భావిస్తున్నారు.

వీరిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ కీల‌క నేత రాంమాధ‌వ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌నే ఆలోచ‌న కూడా కొంద‌రు చేస్తున్నారు. అయితే, ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో క‌చ్చితంగా బ‌లోపేతం అవుతాయ‌నే న‌మ్మ‌కం వారిలో కుద‌ర‌డం లేదు. దీంతో పార్టీలోనే త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకొని కొన‌సాగాలా లేదా పార్టీ మారాలా అనేది తేల్చుకోలేక‌పోతున్నారు.

ఇంత‌లో కొంద‌రు టీడీపీ కాపు నేతుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వారి సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ మంత్రితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మ‌రో మంత్రి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో వైసీపీలో చేరేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రికొంద‌రు మాత్రం మంచో చెడో టీడీపీలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇలా టీడీపీ కాపు నేత‌లు ఎటూ తేల్చుకోలేక ఎవ‌రి దారి వారు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, చంద్ర‌బాబు బుజ్జ‌గింపుతో మెజారిటీ నేత‌లు మాత్రం టీడీపీలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle