newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

చంద్రబాబుకి ఏమైంది? రిటైర్డ్ ఐఎఎస్‌ల నిరసన గళం

17-04-201917-04-2019 16:10:40 IST
Updated On 18-04-2019 15:31:18 ISTUpdated On 18-04-20192019-04-17T10:40:40.966Z17-04-2019 2019-04-17T10:40:38.862Z - 2019-04-18T10:01:18.987Z - 18-04-2019

చంద్రబాబుకి ఏమైంది? రిటైర్డ్ ఐఎఎస్‌ల నిరసన గళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈసీపై తీవ్ర విమర్శలు...సాక్షాత్తూ సీఎస్‌పై ఆరోపణలు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఏమైంది? ఎన్నికల ప్రకటన దగ్గర్నించి, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎవరినీ ఆయన వదలడంలేదు. చంద్రబాబులో ఓటమి భయం పట్టుకుందా? ఆయన మైండ్‌సెట్ ఎందుకిలా మారిపోయింది? ఇప్పుడు ఇవే ఏపీలో రాజకీయనేతలు, సీనియర్ బ్రూరోక్రాట్లు, విశ్రాంత బ్యూరోక్రాట్ల మెదళ్ళను తొలిచేస్తున్న యక్షప్రశ్నలు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తీరుపై రిటైర్డ్ ఐఎఎస్‌లు గళం కలిపారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని వీరంతా వినతిపత్రం అందచేయడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. 

ఎన్నికల వేళ ఈసీ ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీచేసింది. ఆయన స్థానంలో  సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంని నియమించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లపై చంద్రబాబు వ్యాఖ్యల్ని వారు ముక్తకంఠంతో ఖండించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబునాయుడు వాడిన భాష సరికాదంటూ హితవు పలికారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యం నిబద్ధత గల అధికారి అని కొనియాడారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని హైకోర్టు గతంలోనే తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఈసీని బెదిరించే ధోరణి ప్రమాదకరం అన్నారు. చంద్రబాబు వెంటనే ఐఏఎస్‌లకు, ఈసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 34 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ గోపాలరావు, సీఎస్ రంగాచారి, ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు చంద్రబాబు తీరుని తప్పుబట్టారు.

‘‘తాము పదవీ విరమణ చేసిన అధికారులం. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు బెదిరించే ధోరణితో వ్యవహరించడం శోచనీయం. రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరించారు.. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అందుకే తామంతా గవర్నర్‌ని కలిశాం’’ అన్నారు. మరో వైపు చంద్రబాబు ఈవిఎంలపై వ్యవహరిస్తున్న తీరును , సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ తప్పు పట్టారు. 

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని భావించిన కొందరు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం మామూలే అన్నారాయన.  కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అప్రజాస్వామికంగా వున్నాయి. నిరాధార ఆరోపణలు చేసిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు. ఇంకో అడుగు ముందుకేసిన శర్మ.. చంద్రబాబుపై క్రిమినల్ కేసు, పరువు నష్టం దావా వేయాలని ఈసీకి సూచించారు. మొత్తం మీద సీనియర్ బ్యూరోక్రాట్లు చంద్రబాబు తీరుపై బహిరంగంగా నిరసన గళం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle