newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

చంద్రగిరి కోటకు రాజెవరు..?

22-03-201922-03-2019 07:53:56 IST
2019-03-22T02:23:56.532Z22-03-2019 2019-03-22T02:23:47.262Z - - 25-02-2020

చంద్రగిరి కోటకు రాజెవరు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లలో ఒకటి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లి ఈ నియోజకవర్గంలోనే ఉండటం, ఆయన ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడంతో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు పార్టీలూ ఇక్కడ విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

2014 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. మాజీ మంత్రి, నాలుగుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన గల్లా అరుణకుమారిపైన ఆయన 4,518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చెవిరెడ్డి వైఎస్ అండదండలతో రాజకీయంగా ఎదిగారు.

వైఎస్ జగన్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న చెవిరెడ్డి మరోసారి ఇక్కడ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. గత ఏడాది వరకు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న గల్లా అరుణకుమారి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నానికి చంద్రగిరి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. ఓ వైపు చెవిరెడ్డి, మరోవైపు పులివర్తి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు.

ప్రభుత్వ పథకాలను పులివర్తి ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించగా, తన స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తూ, జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా చెవిరెడ్డి ఆరు నెలలుగా నిత్యం ఏవో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే స్వంతంగా ప్రజలకు కానుకలు ఇవ్వడం వంటివి చేయడంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇద్దరూ కోట్లు కుమ్మరించేశారు. ఇద్దరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో కొనసాగుతున్నాయి. ఇవి కేసులు పెట్టుకునే స్థాయి వరకు వెళ్లాయి. ఇక, పులివర్తి నాని తనను హత్య చేయించేందుకు ప్రయత్నించారని చెవిరెడ్డి ఆరోపణలు సైతం చేశారు.

గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు. డబ్బు ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, చంద్రబాబు స్వంత నియోజకవర్గం కావడం, గల్లా అరుణ పూర్తిగా మద్దతు ఇస్తుండటం, నిత్యం ప్రజల్లో ఉండటం పులివర్తి నాని బలాలుగా కనిపిస్తున్నాయి. స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం, నియోజకవర్గంలో వైసీపీతో పాటు తనకూ పట్టుండటం చెవిరెడ్డికి కలిసిరావచ్చు. అయితే, వివాదాస్పదుడు అని. ఎక్కువ వ్యాపారాలకే పరిమితం అవుతారనే పేరుండటంతో ఆయనకు మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రగిరిలో ఈసారి ద్విముఖ పోటీ ఉండనుంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle