ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

చంద్రగిరిలో 19న ఐదుచోట్ల రీపోలింగ్

16-05-201916-05-2019 09:12:15 IST
2019-05-16T03:42:15.438Z16-05-2019 2019-05-16T03:42:09.136Z - - 21-05-2019

చంద్రగిరిలో 19న ఐదుచోట్ల రీపోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో  గత నెల 11న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో రీపోలింగ్ నిర్వహించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఈనెల 19న రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. చంద్రగిరిలో పోలింగ్‌ రోజు ఐదుచోట్ల అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

గ్రామంలో దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుని పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి న్యాయం చేయాలని చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పది రోజుల క్రితం కలెక్టర్‌ ప్రద్యుమ్నని ఈసీ నివేదిక కోరింది. కలెక్టర్‌ నివేదికతో పాటు పంపిన సీసీ కెమెరా పుటేజీతో వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో రీపోలింగ్ నిర్ణయం తీసుకుంది.

ఆయా పోలింగ్ బూత్‌లలో అనేక అక్రమాలు జరిగినట్లు తేలటంతో కలెక్టర్‌ ప్రద్యుమ్న పంపిన నివేదికను ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. వాటిని పరిశీలించి ధృవీకరించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 19న ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈసీ నిర్ణయం ప్రకారం చంద్రగిరి నియోజకవర్గంలోని అసెంబ్లీ, లోక్ సభ బూత్ లలో రీపోలింగ్ జరగనుంది. ఎస్సార్ కమ్మపల్లి బూత్ నెంబర్ 321, పులివర్తిపల్లి (104), కొత్త ఖండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం (313) పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహిస్తారు. 

ఇదిలా ఉంటే, ఈసీ నిర్ణయంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈసీ వైసీపీ నేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తమ పట్ల పక్షపాత ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. పోలింగ్ పూర్తయి నెలరోజులు దాటిపోయిందని, ఈసీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle