newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు రెఫ‌రెండ‌మే..!

25-12-201925-12-2019 09:08:45 IST
Updated On 26-12-2019 12:17:17 ISTUpdated On 26-12-20192019-12-25T03:38:45.427Z25-12-2019 2019-12-25T03:35:12.767Z - 2019-12-26T06:47:17.194Z - 26-12-2019

గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు రెఫ‌రెండ‌మే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన్ని ప్రాంతాలు స‌మాంత‌రంగా అభివృద్ది కావ‌డానికి ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతుండ‌గా అమ‌రావ‌తి మ‌హాన‌గ‌రంగా మారితేనే రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు బాగుంటుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే విశాఖ‌ప‌ట్నాన్ని ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్‌గా చేస్తే సీమ‌వాసుల‌కు దూర‌మ‌వుతుంద‌ని, క‌ర్నూలులో హైకోర్టు పెడితే ఉత్త‌రాంధ్ర వాసులు ఎలా వెళ్లాల‌నే ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇలా ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌పై రాష్ట్ర‌మంతా భిన్నాభిప్రాయాలు ఉండ‌గా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా మార‌నున్న విశాఖ‌ప‌ట్నంలోనూ ఇలానే ఉండ‌టం గ‌మ‌నార్హం.

విశాఖ‌ప‌ట్నం ప్ర‌శాంత‌మైన న‌గ‌రంగా గుర్తింపు పొందింది. వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు ఉండ‌టంతో రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌లు వ‌చ్చి విశాఖ‌లో స్థిర‌ప‌డ్డారు. దీంతో న‌గ‌రంలో కాస్మోపాలిట‌న్ క‌ల్చ‌ర్ ఉంటుంది. ఇక‌, ఇటీవ‌లి కాలంలో న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీ కూడా ఎక్కువే అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్‌గా విశాఖ‌ను మారిస్తే ఏమైనా ఇబ్బందులు వ‌స్తాయా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

న‌గ‌ర ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి భంగం వాటిల్లే అవ‌కాశం ఉందా ? ట‌్రాఫిక్ పెరిగిపోతోందా ? ఖ‌ర్చులు ఎక్కువ‌వుతాయా ? అనే కొన్ని అనుమానాలు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. కానీ, మ‌హాన‌గ‌రంగా మార‌డానికి విశాఖ‌ప‌ట్నానికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌నే అభిప్రాయాలూ ఉన్నాయి. త‌క్కువ ఖ‌ర్చుతోనే రాజ‌ధాని నిర్మాణం పూర్త‌వుతుంద‌నే వాద‌న‌లు ఉన్నాయి. వెనుక‌బాటుకు గురైన‌ ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెందుతుంద‌ని భావిస్తున్నారు.

అయితే, రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు రానున్న గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు రెఫ‌రెండంగా మార‌నున్నాయి. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రీలో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు జ‌రుపుతున్నారు. ఈ ఎన్నిక‌లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం వీచినా విశాఖ న‌గ‌రంలో మాత్రం నాలుగు స్థానాల‌నూ టీడీపీ ద‌క్కించుకుంది.

దీంతో విశాఖ‌పై ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. ఆ పార్టీ కీల‌క నేత విజ‌యసాయిరెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అవంతి శ్రీనివాస్ విశాఖ కార్పొరేష‌న్‌ ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇప్పుడు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయంగానే కాకుండా త‌మ నిర్ణ‌యానికి రెఫ‌రెండంగా ఈ ఎన్నిక‌లు మారాయి. దీంతో వైసీపీకి మ‌రింత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది.

జిల్లా తెలుగుదేశం పార్టీ కూడా రాజ‌ధాని వ్య‌వ‌హారంపై ఆచితూచి స్పందిస్తోంది. ప్ర‌జ‌ల మ‌నోభావాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అంతుచిక్క‌డం లేద‌నందున రాజ‌ధాని నిర్ణ‌యాన్ని న‌గ‌ర టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగ‌తిస్తూనే ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాల‌ను లేవ‌నెత్తుతున్నారు.

న‌గ‌ర టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గ‌ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై రాజ‌ధాని వ్య‌వ‌హారాన్ని చ‌ర్చించారు. ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌గా స్పందించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోస‌మే వైసీపీ ఈ నిర్ణ‌యం తీసుకుందా అనే అనుమానాల‌ను వారు లేవ‌నెత్తుతున్నారు.

అయితే, ఒక కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కోసం ఇంత‌పెద్ద నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయా అనే అంశాన్ని ప‌క్క‌న పెడితే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల్లో మాత్రం రాజ‌ధానిపై న‌గ‌ర ప్ర‌జ‌ల అభిప్రాయం తేల‌నుంది. ఈ నిర్ణయాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వాల్సి ఉంది. ఒక‌వేళ ఓడితే మాత్రం న‌గ‌ర ప్ర‌జ‌లు ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్‌గా విశాఖ‌ను చేయ‌డాన్ని వ్య‌తిరేకించార‌నే భావ‌న వ్య‌క్తం కానుంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle