గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల
19-09-201919-09-2019 14:13:09 IST
Updated On 19-09-2019 15:03:34 ISTUpdated On 19-09-20192019-09-19T08:43:09.353Z19-09-2019 2019-09-19T08:41:41.140Z - 2019-09-19T09:33:34.091Z - 19-09-2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల పరీక్షల ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రామ సచివాలయం.ఎపి.గౌ.ఇన్ వైబ్ సైట్ లో http://gramasachivalayam.ap.gov.in/ వీక్షించవచ్చని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షా 26వేల ఉద్యోగాల నియామకానికి ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది. ఈ నెల 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించి కేవలం పది రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు వచ్చే నెల 2 నుంచి విధులలో చేరాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈనెల 30, అక్టోబర్ 1 తేదీలలో శిక్షణ ఇస్తారు. లక్షా 26 వేల ఉద్యోగాలకు గాను 19లక్షల 74 వేల మంది రాత పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 19 కేటగరీల్లో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయనుంది. పారదర్శక పాలన, అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాల చేరవేత, అవకతవకలు, అక్రమాలకు చెక్ వంటి లక్ష్యాలతో ప్రభుత్వం వలంటీర్ల పోస్టులను క్రియేట్ చేసింది. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు అన్నది ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రికగా చెప్పాల్సి ఉంటుంది. వినూత్న తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి చేకూరే ప్రయోజనాలు ఏ మాత్రం పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థగా జగన్ దీనిని అభివర్ణిస్తున్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా ప్రభుత్వోద్యోగ నియామకాలలో ఒక విధమైన స్తబ్ధత ఏర్పడి ఉంది. డీఎస్సీ మినహా మరే ఉద్యోగ ప్రకటనా వెలువడ లేదు. ఈ నేపథ్యంలో ఏకంగా ఒకే సారి లక్షా 26వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయడమే కాకుండా...వాటికి రాతపరీక్షలు నిర్వహించడం, ఫలితాలను విడుదల చేయడం అన్నీ వాయువేగంతో జరిగిపోయాయి. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సొంత ఊరిలోనే కొలువు చేయగలగడం వీటి ప్రత్యేకత. సొంత ఊరిలోనే కొలువుతో పుణ్యం పురుషార్ధం కలిసివస్తాయని భావించవచ్చు. ఈ కొలువులు ప్రజా సేవతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గట్టిగా చెబుతున్నది. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు నుంచి వారికి చేకూరాల్సిన లబ్ధి ఎటువంటి అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా నేరుగా వారికే అందేలా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
34 minutes ago

రాజా సింగ్కు స్వంత పార్టీలోనే శత్రువులా..?
9 hours ago

బాబు బోర్లాపడితే జగన్ గోతిలో పడుతున్నారా?
10 hours ago

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
10 hours ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
10 hours ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
11 hours ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
11 hours ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
13 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
13 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
05-12-2019
ఇంకా