newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

13-10-201913-10-2019 10:48:15 IST
2019-10-13T05:18:15.262Z13-10-2019 2019-10-13T05:18:11.070Z - - 08-07-2020

 గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్షేమ పథకాలను వెల్లువలాగా ప్రకటిస్తూ, ప్రారంభిస్తూ తనదైన పాలనను ముందుకు తీసుకుపోతున్న ఏపీ ముఖ్య మంత్రి  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వేలాది గ్రామీణ పాఠశాలల విద్యార్థుల దశ దిశలను మార్చివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థులకు అర్బన్ టచ్ అని చెబుతున్న ఈ పథకం అమలయితే రాష్ట్రంలోని గ్రామీణ విద్యార్థులు పట్టణ విద్యార్థులతో పోటీ పడే అరుదైన అవకాశాలను దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు.

అక్టోబర్ 3వ వారంలో మొదలు కానున్న ఈ వినూత్న పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 11,378 గ్రామీణ పాఠశాలలను పట్టణ పాఠశాలల విద్యార్థులతో అనుసంధానం చేయనుంది. పట్టణ ప్రాంతాల విద్యార్థులు, టీచర్లు తమ సమీప ప్రాంతాల్లోని గ్రామీణ పాఠశాలలను నెలకు కనీసం నాలుగురోజులపాటు సందర్శించి తమ అనుభవాలను, నైపుణ్యాలను గ్రామీణ విద్యార్థులతో పంచుకోనున్నారు. 

ఇలా పట్టణ ప్రాంత పాఠశాలల విద్యార్థులు, టీచర్లతో మిళితం కావడం వల్ల గ్రామీణ విద్యార్థులు, వారి టీచర్లు తమ నైపుణ్యాలను, జ్ఞానాన్ని మెరుగుపర్చుకునే వీలుందని ప్రభుత్వ భావన. గ్రామీణ పాఠశాలలతో పోలిస్తే పట్టణ ప్రాంత పాఠశాలలు, విద్యార్థులు మెరుగైన విద్య, టెక్నిక్కులను కలిగి ఉంటున్నారనేది కాదనలేని సత్యం. 

అందుకే రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా పట్టణ ప్రాంత పాఠశాలల విద్యార్థులను, టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు పంపి వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని తోటి గ్రామీణ విద్యార్థులకు పంచడానికి భారీ పథకం సిద్ధం చేస్తోంది.

దీంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పాఠశాల స్థాయిలో ప్రత్యేక స్కూల్ కమిటీలను ప్రభుత్వమే నియమించనుంది. ఈ కార్యక్రమంలో భాగమయ్యే పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించనుంది. సర్వశిక్షా అభియాన్ ఈ పథకాన్ని సమన్వయం చేయనుందని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వచ్చే రెండేళ్లలోపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనను, సౌకర్యాల మెరుగుదకువ వీలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

Related image

ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   an hour ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   an hour ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   2 hours ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   3 hours ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   3 hours ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   3 hours ago


టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

   16 hours ago


టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

   16 hours ago


డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

   21 hours ago


విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle