newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

25-05-202025-05-2020 07:50:28 IST
Updated On 25-05-2020 08:50:00 ISTUpdated On 25-05-20202020-05-25T02:20:28.359Z25-05-2020 2020-05-25T02:20:26.632Z - 2020-05-25T03:20:00.062Z - 25-05-2020

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థకు లాక్ డౌన్ తర్వాత పునఃప్రారంభానికి అనుమతులు ఎవరిచ్చారు? ఘటన తర్వాత ప్రభుత్వం సంస్థపై తీసుకున్న చర్యలేంటి? ప్రమాదం తర్వాత గ్యాస్ ట్యాంకుల్లో మిగిలిన విషవాయువును సంస్థ ఇతర దేశాలకు పంపేందుకు అనుమతిచ్చిందెవరు? అసలు ఇంత ఘోర ప్రమాదం జరిగిన తర్వాత దర్యాప్తు జరగకుండానే సంస్థలోకి ఇతరుల ప్రవేశానికి అనుమతులు ఎలా ఇచ్చారు? ప్రభుత్వం పరిహారం ఇచ్చింది సరే.. సంస్థపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? అసలు సంస్థ డైరెక్టర్లను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఇలా హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్నో ప్రశ్నలు సంధించింది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. అంత ఘోర ప్రమాదం జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయి వందలలో ఆసుపత్రుల పాలవగా.. పంటలు, పశువులు కూడా ఎక్కడివక్కడే కుప్పకూలిపోయాయి. మరి అంతటి ప్రమాదంపై చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదే బాధితుల ఆవేదన. ప్రభుత్వం ఆ అంశంపై ప్రశ్నించిన వారిపై కూడా చర్యలకు సిద్ధమైంది.

అయితే, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం కానీ పూర్తి ఆదేశాలతో కూడిన ప్రతులు ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. దీంతో హైకోర్టు పూర్తి ఉత్తర్వులు ప్రపంచానికి తెలిసింది. అసలు లాక్‌డౌన్‌ తర్వాత కంపెనీకి పర్మిషన్ ఎలా‌ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది.

కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్‌ స్వాధీన పరచి.. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కంపెనీ పరిసరాలను సీజ్ చేయాలని, విచారణ కమిటీలు మినహా.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ అనుమతించవద్దని ధర్మానసం స్పష్టం చేసింది. విచారణ కమిటీలు కూడా ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

ప్రమాదం తర్వాత ట్యాంకుల్లో మిగిలిన స్టైరీన్‌ గ్యాస్‌ తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రజలు నివాసం ఉండే చోట, హాస్పటిల్స్, విద్యాసంస్థలు ఉన్న చోట అంత ప్రమాదకరమైన విషవాయునును ఎలా నిల్వ చేశారో కూడా కంపెనీ చెప్పాలని ఆదేశించింది. నిజానికి కోర్టు ఆదేశాలలో చాలా అనుమానాలు ఘటన జరిగిన నాటి నుండే సామాన్య ప్రజలు సైతం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బును బాధితులకు పంచారు. మరి కంపెనీ వద్ద పరిహారం ప్రభుత్వం వసూలు చేసిందా? లేదా? ప్రజల డబ్బు పంచినపుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఘటన జరిగిన స్థలంలో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచాలి. అధికారుల అనుమతి లేకుండా ఒక్క అంగుళం కూడా అక్కడ నుండి కదలడానికి లేదు.

కానీ విశాఖ గ్యాస్ లీక్ ఘటన అనంతరం దర్యాప్తు పూర్తి కాకుండానే కంపెనీ సిబ్బందితో పాటు ఏకంగా మిగతా ట్యాంకుల్లో మిగిలిన గ్యాస్ ను ఇతర దేశాలకు తరలించేశారు. పైగా కంపెనీపై చర్యలు తీసుకుంటున్నట్లుగా కానీ.. ఇదిగో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని కానీ ఎక్కడా హామీలు లేవు. జరిగింది.. అయిపొయింది.. థిస్ ఈజ్ నిరంతర ప్రక్రియ అన్నట్లుగానే ప్రభుత్వం ముందుకెళ్లింది. కానీ హైకోర్టు మాత్రం సామాన్యుల మెదళ్లను తొలిచేస్తున్న అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. మరి ప్రభుత్వం సుత్తి లేకుండా సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle