newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

గోదావరి ప్రమాదాల్లో పర్యాటక శాఖ లోపమెంత?

16-09-201916-09-2019 15:38:30 IST
2019-09-16T10:08:30.005Z16-09-2019 2019-09-16T09:53:22.769Z - - 15-12-2019

గోదావరి ప్రమాదాల్లో పర్యాటక శాఖ లోపమెంత?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోదావరిలో లాంచీ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. లంక గ్రామాలు తన నిత్యావసరాల కోసం పడవ ప్రయాణాలనే ఆశ్రయిస్తారు. సాధారణంగా అటువంటి ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా వారికి వారుగా స్వచ్ఛందంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అయితే పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాపికొండల మార్గం ద్వారా భ్రదాచలం వెళ్లే మార్గంలో పర్యాటక శాఖ లాంచీలో కాకుండా ప్రైవేటు లాంచీలు కూడా తిరుగుతుంటాయి. పర్యాటకుల భద్రతకు సంబంధించి పలు అంశాలపై పర్యాటక శాఖ పెద్దగా శ్రద్ధ పెట్టక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. 

తాజాగా సెప్టెంబర్ 15వ తేదీన జరిగిన లాంచీ ప్రమాదం విషయం తీసుకుంటే పర్యాటక శాఖ నిర్లక్ష్యం, జలవనరుల శాఖ ఉదాశీనత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అభ్యంతరాలను, హెచ్చరికలను లెక్క చేయకుండా తిరిగే లాంచీలను సీజ్ చేయడం, వాటి యజమానులపై చర్యలు తీసుకోవడం ఇప్పటి వరకూ జరిగిన దాఖలాలు లేవు.  ఆదివారం ప్రమాదానికి గురైన లాంచీ విషయానికే వస్తే అది ప్రయాణించిన మార్గం అత్యంత ప్రమాదకరమైనదని అందరికీ తెలుసు...ఆ ప్రాంతంలో గోదావరి వడి అధికంగా ఉంటుందనీ తెలుసు అయినా తెలిసి తెలిసీ ఆ మార్గంలో లాంచీ వెలుతున్నా పట్టించుకోని ఫలితమే ప్రమాదం. పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడానికి అదే కారణం.

ఆ ప్రాంతంతో గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రాంతంలో గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంటుందని చెబుతారు. సుడిగుండాల మార్గంలో లాంచీల ప్రయాణానికి అనుమతి లేదు. అయినా వాటిని ఇసుమంతైనా ఖాతరు చేయకుండా లాంచీ ఆ మార్గంలో వెళ్లిందంటే పర్యాటక శాఖ పర్యవేక్షణ నిఘా లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. పర్యాటక ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ఆ శాఖకు పర్యాటకుల భద్రత మీద లేదనడానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదని ఈ దారుణ ప్రమాదం తేటతెల్లం చేస్తుంది. 

గతంలో ఇదే ప్రాంతంలో దాదాపుగా ఇదే విధంగా జరిగిన ప్రమాదంలో 60 మంది మరణించారు. ఆ తరువాత కూడా ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. రెండేళ్ల కిందట ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో బోటు నిర్వాహకుల సమయస్ఫూర్తి కారణంగా పర్యాటకులు తృటితో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.

వరుసగా, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా...పర్యాటక శాఖ ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు దాదాపు మృగ్యం. అసలు పర్యటక శాఖ ఆధ్యర్యంలోనే లాంచీలు నడపాలన్న డిమాండ్ ను గత ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించినా శాఖ ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక లాంచీల భద్రత విషయంలో యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నా...నిఘా, పర్యవేక్షణ విషయంలో పర్యాటక శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అయినప్పటి నుంచీ పోలవరం కొండల మధ్యాగా లాంచీ ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి పర్యాటకులలో విపరీతంగా పెరిగింది. 

పోలవరం పూర్తయితే పాపికొండల అందాలు  కనుమరుగౌతాయన్న భావనే ఇందుకు కారణం. దీంతో ఈ మార్గంలో  లాంచీల ప్రయాణం పర్యాటక శాఖకు కాసులు రాల్చి పెడుతున్నది. అయితే ఆదాయం మీద యావ తప్ప పర్యాటకుల భద్రతపై ఇసుమంతైనా శ్రద్ధ పెట్టని పర్యాటక శాఖ నిన్న ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గోదారిపై పర్యాటకులను తీసుకువెళుతున్న లాంచీలు భద్రత ప్రమాణాలను పాటిస్తున్నాయా? సామర్ధ్యాన్ని మించి పర్యాటకులను లాంచీల్లో తీసుకువెళుతున్నారా అన్నది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆ శాఖ అధికారులు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిన ఫలితంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. రేవు రేవు వద్దా తనిఖీలు చేయాలాన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని ఎప్పుడూ గౌరవించి అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే నిబంధనలు, చర్యలూ అంటూ హడావుడి చేసే ప్రభుత్వం, పర్యాటక శాఖ ఆ తరువాత ఆ సంగతే గుర్తు లేనట్టుగా వ్యవహరిస్తున్నాయి.

గత పుష్కరాల సమయంలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం కానీ, గోదావరిపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలు కానీ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం వల్లనేనన్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు.

Image result for godavari in boat accident


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle