గోదావరి తమ్ముళ్ళు కలవరపడుతున్నారా?
18-05-201918-05-2019 08:04:49 IST
Updated On 27-06-2019 16:20:21 ISTUpdated On 27-06-20192019-05-18T02:34:49.521Z18-05-2019 2019-05-18T02:34:00.130Z - 2019-06-27T10:50:21.393Z - 27-06-2019

2014 ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం లేకుండా దున్నేసిన తెలుగు తమ్ముళ్ల నాగళ్ళకు బండరాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఈసారి ఎక్కడో తేడా కొడుతోందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా నాలుగైదు నియోజకవర్గాలలో టీడీపీ ఓటు బ్యాంకుకి బాగా గండిపడబోతోంది. దీనికి కారణం ప్రతిపక్ష వైసీపీ కాదు. ఇక్కడ బరిలోకి దిగిన ముఖ్య పార్టీల అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఓటర్లను తికమక పెడుతున్నాయి. చివరి క్షణంలో అభ్యర్థుల మార్పుతో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేక వారు హైరానా పడ్డారు. వీటిలో కొవ్వూరు, చింతలపూడి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఏర్పడిన విచిత్రమైన పరిస్థితి ఇది ! మొదట కొవ్వూరులో మంత్రి జవహర్ కి టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆ తరువాత ఆయనను తిరువూరుకు మార్చేశారు. స్థానిక నేత పెండ్యాల అచ్చిబాబు వర్గం వ్యతిరేకించడంతో.. ఆయన స్థానే వంగలపాటి అనితను రంగంలోకి దింపారు. ఇక చింతలపూడిలో సిటింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు టికెట్ కేటాయించాలని తొలుత భావించినా.. ఆమెకు వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు అధిష్టానం పై ఒత్తిడి తేవడం బాబు అక్కడ కర్రా రాజారావుకు టికెట్ ఇచ్చారు. దే అదనుగా పీతల వర్గంలో కొందరు వైసీపీలో చేరారు. మొత్తానికి చింతలపూడి రెండు వర్గాలుగా చీలిపోయింది. తాడేపల్లి విషయానికే వస్తే..కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈలి నానికి టికెట్ లభించింది. అయితే ఇందుకు అలిగిన జెడ్పీచైర్మన్ బాపిరాజు ..ప్రచారానికి కొన్ని రోజులు దూరమయ్యారు. ఈయనకు మొదటి నుంచీ మద్దతు పలుకుతూ వస్తున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ తరువాత దూరమై జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ మూడుచోట్ల తమ నేతలు ఎవరికి వారు తమ వర్గాలతో ముందుకెళ్లడంతో.. ఓటర్లు అయోమయంలో పడ్డారు. వీళ్ళిలా గందరగోళంలో పడుతుండగా.. పందెం రాయుళ్ళు మాత్రం ఎవరు గెలుస్తారన్నదానిపై జోరుగా లక్షల్లో పందాలు కాయడమే కొసమెరుపు. వీటితో పాటు ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో గెలుపుపై ధీమా ఉన్నా, ఎక్కడో తేడా కొడుతోంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ కంటే వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఇక్కడ పందెం రాయుళ్ళు పవన్ ఓటమిపై భారీగా పందేలు కాశారు. ఇంకోవైపు జిల్లాలో జనసేన ఓట్లను బాగా చీల్చిందని, ఆ ప్రభావం టీడీపీపై పడుతుందని అంటున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో ప్రచారాన్ని బట్టి భీమవరం అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్‌కు కేబినెట్లో చోటు ఉంటుందని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. జగన్ కు గ్రంధి శ్రీనివాస్ విజయంపై అంత నమ్మకం ఉందని అంటున్నారు. మొత్తానికి జిల్లాలో టీడీపీ గెలుపు ఏకపక్షం కాదని, వైసీపీ పక్కలో బళ్ళెంలా మారడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి జిల్లాలో ఏడెనిమిది సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రా యూనివర్శిటీ పాలకమండలి మాజీ సభ్యులు డా.గుబ్బల తమ్మయ్య ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధికి చెప్పారు. అదే జరిగితే జిల్లాలో టీడీపీ ఆధిపత్యానికి గండిపడడం గ్యారంటీ.

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా