newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాలకు దారేది?

09-09-201909-09-2019 09:12:59 IST
Updated On 09-09-2019 09:16:51 ISTUpdated On 09-09-20192019-09-09T03:42:59.658Z09-09-2019 2019-09-09T03:42:50.546Z - 2019-09-09T03:46:51.719Z - 09-09-2019

గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాలకు దారేది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాని ప్రభావం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పైనే బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో లంకగ్రామాలు గోదారి వరదతో దారితెన్నూ లేకుండా కొట్టుమిట్టాడుతున్నాయి.

రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజ్ నీటిమట్టం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వరదతో  ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గణనీయంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 49.8 అడుగులకు చేరన ప్రవాహం.. రాత్రికి 50.80 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.10 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి దిగువకు 13 లక్షల 22 వేల 245 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గంటకు గంటకు క్రమేపీ పెరుగుతుండటంతో భయాందోళనలో వున్నారు కోనసీమలో లంక గ్రామ ప్రజలు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తూర్పు ఏజెన్సీలోని విలీన మండలాలు, దేవీపట్నం మండలానికి సంబంధించిన పలు గ్రామాలు.. కోనసీమలో పలు లంక గ్రామాలు నీట మునిగాయి. 

వరద ముంపు పొంచి ఉండటంతో.. తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ఏజెన్సీ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు వరదముంపులో ఉన్నాయి.  భద్రాచలం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

వరద ప్రభావం వల్ల  రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. వరద ముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది.

వివిధ అధికార బృందాలకు సహకరించాలని విపత్తుల శాఖ కమీషనర్ ఇతర శాఖలకు సూచించారు. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ పేర్కొన్నారు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle