newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

గోదావరిలో పర్యాటక పడవ మునక

15-09-201915-09-2019 15:57:54 IST
Updated On 15-09-2019 17:22:21 ISTUpdated On 15-09-20192019-09-15T10:27:54.932Z15-09-2019 2019-09-15T10:27:47.468Z - 2019-09-15T11:52:21.509Z - 15-09-2019

గోదావరిలో పర్యాటక పడవ మునక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

- సుమారు 40మంది ప్రయాణీకులు గల్లంతు

- పర్యాటకులు పాపికొండలు వెళ్తుండగా ఘటన

తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది.

గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పర్యాటకులతో వెళ్తున్న పున్నమి టూరిజం సంస్థకు చెందిన లాంచీ దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు గ్రామాల మధ్య అదుపుతప్పి గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 62 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 51 మంది ప్రయాణికులు ఉండగా.. మిగిలిన వారంతా సిబ్బంది. లైఫ్‌ జాకెట్లు ధరించిన 17మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీరిని స్థానిక గ్రామస్థులు పడవల్లో వెళ్లి రక్షించారు. గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉండటం వల్లే బోటు అదుపుతప్పి మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోదావరిలో ప్రస్తుతం 5లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

ప్రభుత్వం ఆరా.. సహాయక చర్యలు ముమ్మరం...

గోదావరి నదిలో ఆదివారం పర్యాటలకు లాంచీ బోల్తా పడిన ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ తూర్పుగోదావరి జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం వెంటనే రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించారు. ఒక్కో బృందంలో 30 మంది సభ్యులుంటారు. నదిలో వరద పోటు ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వారి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయు మార్గంలో గాలింపు చేపట్టేందుకు ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్‌ బయలుదేరి వెళ్లింది.

ప్రమాద స్థలికి మంత్రులు..

పడవ ప్రమాద ఘటనపై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరా తీశారు. జిల్లా ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారులతో ఫోన్‌ చేసి ఘటనకు సంభందించిన విషయాలు అడిగితెలుసుకున్నారు. పర్యాటకులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గోదావరిలో బోటు ప్రమాదం దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాయల్‌ వశిష్ట లాంచీ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందని, ఘటనా స్థలానికి విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్లు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఘటన స్థలికి అవంతి, కన్నబాబులతో పాటు పలువురు మంత్రులు బయలుదేరి వెళ్లారు.

Image result for Tourist boat docks in Godavari in andhra pradesh helicopter comes

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle